Begin typing your search above and press return to search.
రుద్రాక్ష ట్రోల్స్ పై అఖిల్ రియాక్ట్
By: Tupaki Desk | 15 Oct 2021 3:30 AM GMTఅఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో అఖిల్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. విభిన్నమైన హెయిర్ స్టైల్ తో పాటు డిజైనర్ డ్రస్ లతో మెప్పించాడు. ఎక్కువ శాతం అఖిల్ తన చేతికి రుద్రాక్ష దండను చుట్టుకుని కనిపించాడు. ఈ మద్య కాలంలో యువకులు ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. స్టైల్ కోసం అన్నట్లుగా అమ్మాయిలు కూడా రుద్రాక్ష ను చేతికి చుట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది.
ఫ్యాషన్ కోసం రుద్రాక్ష మాలను చేతికి స్టైల్ గా ధరించడంను కొందరు హిందుత్వ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని.. రుద్రాక్ష అంటే శివుడి స్వరూపంగా భావిస్తాం. కనుక అలా చేయకూడదు అంటూ కొందరు అంటున్నారు.
అఖిల్ కూడా రుద్రాక్ష మాలను ధరించండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సెలబ్రెటీ రుద్రాక్ష మాలను చేతికి చుట్టుకోవడం ద్వారా ఇతరులకు కూడా దీన్ని అలవాటు చేసిన వారు అవుతారు అంటూ కొందరు అఖిల్ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా అఖిల్ ఈ విషయమై స్పందించాడు. తాను రుద్రాక్షను చేతికి కట్టుకున్నది స్టైల్ కోసం మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. తనకు రుద్రక్ష చేతికి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఒకరు చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి నేను నా చేతికి ధరించినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్ భక్తితోనే రుద్రాక్షను ధరించడం అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికి అయినా ట్రోల్స్ ఆగుతాయని ఆశిద్దాం.
ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్ దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా లో అఖిల్ విభిన్నమైన పాత్రను పోషించాడు. అఖిల్ మరియు పూజా హెగ్డేల రొమాన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అఖిల్ అక్కినేనికి మొదటి కమర్షియల్ బ్రేక్ ను ఇస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.