Begin typing your search above and press return to search.
అఖిల్ ఆ రీమేక్ కే ఫిక్సయ్యాడా?
By: Tupaki Desk | 2 Jan 2016 10:58 AM GMTహీరోగా తన తొలి సినిమా విషయంలో అఖిల్ ఎంతో జాగ్రత్తగా, స్ట్రాటజిక్ గా అడుగులు వేసినా ఫలితం లేకపోయింది. అఖిల్ - నాగ్ కలిసి వేసుకున్న లెక్కలన్నీ తారుమారైపోయాయి. దీంతో ఇక రెండో సినిమా విషయంలో అయోమయంలో పడిపోయారు తండ్రీ కొడుకులు. ఇక్కడి దర్శకుల్ని - కథల్ని పరిశీలించి సంతృప్తి చెందక.. ఓ బాలీవుడ్ మీద దృష్టిపెట్టినట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట అక్కడ సెన్సేషనల్ హిట్టయిన ‘యే జవాని హై దివాని’ మీద అక్కినేని ఫ్యామిలీ మనసు పడ్డట్లు చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అఖిల్ రెండో సినిమా దీని రీమేకే అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
‘యే జవాని హై దివాని’ని తెలుగులో తీయడానికి ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తో దాదాపుగా అగ్రిమెంట్ జరిగిపోయినట్లు అక్కినేని ఫ్యామిలీ వర్గాల సమాచారం. మామూలుగా కరణ్ తన సినిమాల రీమేక్ రైట్స్ అమ్మడు. ఆ హక్కుల రేటుకే సినిమాలో వాటా తీసుకుంటాడు. నాగ్ కూడా అందుకు ఒప్పకుని ధర్మప్రొడక్షన్స్ తో కలిసి తన అన్నపూర్ణ స్టూడియో బేనర్ మీద సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడట. ఐతే ఇంకా దీనికి దర్శకుడెవరన్నది మాత్రం ఫిక్సవలేదు. ఓ ప్రముఖ దర్శకుడినే ఎవరినైనా ఫిక్స్ చేసే అవకాశముంది. ఐతే ‘యే జవాని హై దివాని’ని ఉన్నదున్నట్లు తీయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేస్తారట. కొందరు రచయితల బృందానికి ఈ పని అప్పగిస్తారట. కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టు విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.