Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:00 PM IST
అఖిల్ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌
X
అక్కినేని చిన్నోడు అఖిల్ రెండో సినిమాకి రంగం సిద్ధ‌మైంది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఆ సినిమా జ‌న‌వ‌రి 4న అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. నిజానికి విక్ర‌మ్ చెప్పిన క‌థకి నాగ్‌ - అఖిల్ ఎప్పుడో గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేశారు. విక్ర‌మ్ కూడా పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాడు. ఇక ప్రారంభ‌మే ఆల‌స్యం అనుకొంటున్న స‌మ‌యంలో విక్ర‌మ్ పెళ్ళి ఖాయ‌మైంది. ఆ ప‌నుల వ‌ల్ల సినిమా ప్రారంభం వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత అఖిల్ నిశ్చితార్థం హ‌డావుడి మొద‌లైంది. దాంతో ఆ రెండు శుభ‌కార్యాల త‌ర్వాతే సినిమాని ప్రారంభించాల‌ని నాగ్ నిర్ణ‌యం తీసుకొన్నాడు.

ఇటీవ‌లే అఖిల్ నిశ్చితార్థం పూర్తయింది. పెళ్లికి ఇంకాస్త స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఆలోపు సగం సినిమాని పూర్తి చేయొచ్చ‌నే ఉద్దేశంతో సినిమాని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అందుకే జ‌న‌వ‌రి 4న ముహూర్తం పెట్టేశారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌ ని అఖిల్ స‌ర‌స‌న హీరోయిన్‌ గా ఎంపిక చేశారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌బోతున్నాడు. ఓ ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్క‌నున్న సినిమా గురించి అక్కినేని అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున అన్నీ తానై ఈ ప్రాజెక్టుని సెట్ చేశాడు. మొద‌ట హ‌ను రాఘ‌వ‌పూడి క‌థ ఓకే అయినా, నాగ్ జోక్యం చేసుకొని విక్ర‌మ్‌ కి అఖిల్ రెండో సినిమా బాధ్యత‌ల్ని అప్ప‌జెప్పాడు. అక్కినేని కుటుంబానికి `మనం`లాంటి ఓ మంచి చిత్రాన్ని అందించిన విక్ర‌మ్ అఖిల్‌కి తొలి విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/