Begin typing your search above and press return to search.
రెండో సినిమా.. రెండు నెలల వాయిదా
By: Tupaki Desk | 17 May 2016 1:46 PM GMTఇప్పటివరకు అనేకసార్లు రూమర్లకు తనే స్వయంగా క్లారిటీ ఇస్తూ వచ్చాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. తన రెండో సినిమా గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా.. క్లారిటీ మాత్రం రాలేదు. ఇప్పుడు మనోడు స్వయంగా చెప్పిన మాటేంటంటే.. మరో రెండు నెలలు ఈ సినిమా వాయిదా పడింది.
ఒక ప్రముఖ టివి ఛానల్ తో మాట్లాడిన అఖిల్.. తాను ఇంకా సెకండ్ సినిమా కథను ఫిక్స్ చేసుకోలేదని. జూలై నెల చివర్లో బహుశా ఈ సినిమా గురించి ప్రకటిస్తానని చెప్పాడు. అంతే కాదు.. ఈ సినిమా విషయంలో వంశీ పైడిపల్లితో తనకు ఎటువంటి విభేదాలూ లేవని కూడా చెప్పాడు. ''మొదట్లో ఏ జవానీ హై దివానీ రీమేక్ చేద్దాం అనుకున్నాం. కాని అది చెయ్యట్లేదు. నేనూ వంశీ కలసి ఏదైనా కొత్త సినిమానే చేస్తాం. అయితే జూలై ఎండింగ్ కే ఆ కథపై క్లారిటీ వస్తుంది. అలాగే ఆ తరువాత ఏ జవానీ హై దివానీ రీమేక్ కూడా నేను చేస్తా. కాని వంశీ డైరక్షన్ లో కాదు'' అంటూ సెలవిచ్చాడు.
ఆ లెక్కన చూస్తే.. తన తొలి సినిమా వచ్చిన సంవత్సరానికి కూడా అఖిల్ తన రెండో సినిమాతో రాలేకపోతున్నాడు. కాకపోతే ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడు ఎక్స్ పెక్టేషన్లు బాగా పెరిగిపోతాయ్. మరి అఖిల్ వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.