Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరిః కింగ్ తో అఖిల్
By: Tupaki Desk | 16 Sep 2017 7:06 AM GMTస్టార్ హీరోల కుమారులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే ఆ సంబరాలు మాములుగా ఉండవు. ప్రతి ఒక్కరు వారు ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటారు. అయితే చాలా వరకు మొదటి సినిమాను హీరోలు వారి పలుకుబడితో ఎలాగో అలాగా ఆడించేస్తారు. కానీ కొందరే అపజయాన్ని అంగీకరించి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెడతారు.
ఆ తరహాలో అక్కినేని ఫ్యామిలీ మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పవచ్చు. ఎన్ని అపజయాలు వచ్చినా ప్రతి ఓటమిని పాఠంగా నేర్చుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకువెళతారు. జయాపజయాలతో సబందం లేకుండా నాగార్జునా తన స్టైల్ తో ఇప్పటివరకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐద పదుల వయసు దాటిపోతున్నా ఇంకా నవమన్మదుడు అనేలా కనిపిస్తున్నాడు. ఇక నాగ చైతన్య మొదటి సినిమాతోనే అలాంటి ఎదురుదెబ్బ తిన్నా ఆ తర్వాత మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే స్థాయిలో అఖిల్ అక్కినేని తన రెండవ సినిమాతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే "హలో" చెబుదామని అనుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా షూటింగ్ బ్రేక్ లో నాగ్ తో అఖిల్ దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
కింగ్ సెల్ఫీ అని హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. ఇద్దరు బ్రదర్స్ లా ఉన్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హలో సినిమా కు సంబందించిన ప్రతి విషయంలో నాగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు ఖాళి దొరికినప్పుడల్లా ఆ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళుతున్నాడు. ఈ సినిమా అన్నపూర్ణా స్టూడియోస్ లో నాగ్ తనే నిర్మిస్తున్నాడు. మార్కెట్ ను కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాకోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా నాగ్ ఎస్ ఇనిమను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.