Begin typing your search above and press return to search.

పార్టీలో ప్రభాస్ ఉండాల్సిందేనట

By:  Tupaki Desk   |   20 Dec 2017 2:30 AM GMT
పార్టీలో ప్రభాస్ ఉండాల్సిందేనట
X
యంగ్ రెబల్ స్టార్ వ్యక్తిగత విషయాల గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. అతను మీడియాతో మాట్లాడటమే తక్కువ. మాట్లాడినా తన పర్సనల్ లైఫ్ గురించి ఏమాత్రం ఓపెనవ్వడు. ఐతే ప్రభాస్ గురించి వేరే వాళ్లు మాత్రం ఆసక్తికర ముచ్చట్లు చెబుతుంటారు. ఇప్పుడు అక్కినేని యంగ్ హీరో అఖిల్.. ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. మందు పార్టీల్లో ప్రభాస్ ఉంటే భలే ఉంటుందని చెప్పాడు. అంతకుమించి డీటైల్స్ చెప్పలేదు కానీ.. ప్రభాస్ పార్టీలో ఉంటే మాత్రం ఆ కిక్కే వేరని ‘హలో’ ప్రమోషన్లలో భాగంగా సాగిన ఒక ఇంటర్వ్యూ అఖిల్ వ్యాఖ్యానించాడు.

తాను ఎప్పుడు పార్టీ చేసుకున్నా అది రానా దగ్గుబాటితోనే అన్న అఖిల్.. తాను రానా కలిసి పార్టీ చేసుకుంటే అక్కడ ప్రభాస్ కూడా ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. తామిద్దరం కలిసి కూర్చున్నపుడు ఎక్కువగా మాట్లాడుకునేది కూడా ప్రభాస్ గురించే అని అతనన్నాడు. తనకు.. రానాకు రామ్ చరణ్ కూడా మంచి ఫ్రెండ్ అని.. పార్టీ ఉంటే చరణ్ కు కచ్చితంగా కాల్ చేస్తానని అతనన్నాడు. తామందరం పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేస్తామని.. ఐతే మంచు మనోజ్.. సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్లు తోడైతే ఆ పార్టీ రచ్చ రచ్చగా మారిపోతుందని.. వారి అల్లరిని తట్టుకోవడం తమ వల్ల కాదని అఖిల్ అన్నాడు.