Begin typing your search above and press return to search.
చార్జింగ్ తగ్గిపోయిందంటున్న అఖిల్!
By: Tupaki Desk | 6 Aug 2016 10:54 AM GMTహీరోగా తన మొదటిసినిమా "అఖిల్"తో సినీరంగప్రవేశం చేశాడు అక్కినేని అఖిల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోయేసరికి ఈసారి కథాపరంగా మరింత స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఉన్న అఖిల్ తాజాగా ఆటాడుకుందాం రా.. సినిమా ఆడియో ఫంక్షన్ లో మెరిశాడు. సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన అఖిల్ మాట్లాడుతూ.. రెండో సినిమా చేసే ముందు తనకు చార్జింగ్ తగ్గిపోయిందని, కాకపోతే ఈ సినిమా మళ్లీ చార్జింగ్ అయ్యిందని చెప్పాడు.
అనంతరం అభిమానులే మా బలం - మా ధైర్యం అని మొదలుపెట్టిన అఖిల్.. అక్కినేని అభిమానులనందర్నీ చూస్తే ఫుల్ ఎనర్జీ వస్తుందని, ఇక తాను చెలరేగిపోతానని చెప్పారు. ఈ ఆడియో ఫంక్షన్ లో అనూప్ పై తన అభిమానాన్ని - గౌరవాన్ని తెలిపిన అఖిల్.. తమ ఫ్యామిలీ నుంచి ఒక సంగీత దర్శకుడు వచ్చి ఉంటే అది అనూపే అని, నాగార్జునకు తమ్ముడిలా, నాగ చైతన్యకు అన్నయ్యలా పనిచేస్తాడని అన్నారు. ఇదే సందర్భంగా నాగార్జున ఈ ఆడియో ఫంక్షన్ కి రాకపోవడానికి గల కారణాన్ని కూడ అఖిల్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం అమితాబ్ గారితో ముంబాయిలో యాడ్ షూటింగ్ ఉండడం వల్ల నాగార్జున రాలేదని అందుకు సారీ చెప్పమన్నారని అఖిల్ తెలిపారు.
కాగా సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న "ఆటాడుకుందాం..రా" చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుంది. శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ బ్యానర్స్ పై చింతలపూడి శ్రీనివాసరావు, అక్కినేని నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి అనూప్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఘనంగా జరిగింది.