Begin typing your search above and press return to search.

పెదనాన్న చిరంజీవి.. పెద్దన్నయ్య చరణ్‌

By:  Tupaki Desk   |   21 Dec 2017 4:12 AM GMT
పెదనాన్న చిరంజీవి.. పెద్దన్నయ్య చరణ్‌
X
అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కేవలం అక్కినేని ఫ్యాన్స్ నే కాదు.. మెగా అబిమానులను కూడా బాగానే మెప్పించింది. ఈ ఈవెంట్ కు చిరంజీవి.. రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రావడం ఒక మేజర్ అట్రాక్షన్ అయింది. ఇదే టైంలో అఖిల్ - రాం చరణ్ ల మధ్య ఉన్న అనుబంధం కూడా ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది.

అఖిల్ కూడా స్టేజ్ పైకి వచ్చిన వెంటనే చిరంజీవి... చరణ్ చూసేసరికి ఫ్రీజ్ అయిపోయి ఒక్కక్షణం ఏం మాట్లాడలేకపోయానన్నాడు. ‘మా పెదనాన్న చిరంజీవికి.. మా పెద్దన్నయ్య రామ్ చరణ్ కు థ్యాంక్స్’’ అంటూ మొదట్లోనే మెగా అభిమానులను క్లీన్ బౌల్డ్ చేశాడు. చిరంజీవి- నాగార్జున ఫ్యామిలీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలిసిందే అయినా బంధుత్వం కలుపుతూ అఖిల్ అన్నమాటలు అందరినీ భలేగా ఆకట్టుకున్నాయి. ‘‘అఖిల్ కు.. రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. వాళ్లిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్సయ్యారో.. ఎప్పటి నుంచి పెద్దన్నయ్య అని పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ అలా పిలవడం చాలా బాగుంది. సో హ్యాపీ’’ అంటూ నాగార్జున ఆనందంగా చెప్పుకొచ్చాడు.

‘‘అఖిల్ అప్పుడప్పుడు మా ఇంటికొస్తుండేవాడు. ఎప్పుడొచ్చినా దగ్గర కూర్చుని అందరి యోగక్షేమాలు ఆరాతీస్తుండేవాడు. తనను చూసినప్పుడల్లా రామ్ చరణ్ కు ఓ తమ్ముడిని కని ఉండే బాగుండేదని సురేఖ ఎమోషన్ అయింది. కానీ మరో బిడ్డ లేడన్న లోటు అఖిల్ తీరుస్తాడని చెప్పాను’’ అని మెగాస్టార్ చిరంజీవి అఖిల్ తో తమ ఫ్యామిలీకున్న రిలేషన్ ను సభాముఖంగా పంచుకున్నారు.