Begin typing your search above and press return to search.

`అఖిల్` ప్లాప్ బాధ్య‌త నాదే:అఖిల్

By:  Tupaki Desk   |   27 Dec 2017 10:32 AM GMT
`అఖిల్` ప్లాప్ బాధ్య‌త నాదే:అఖిల్
X
భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన అక్కినేని అఖిల్ అరంగేట్ర చిత్రం `అఖిల్` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో, త‌న రెండో సినిమాపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన నాగ్ - అఖిల్ లు హ‌లో చిత్రంలో మంచి హిట్ ను అందుకున్నారు. హ‌లో చిత్రం స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న అఖిల్ త‌న మొద‌టి చిత్రంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయిన సంద‌ర్భంలో త‌న మాన‌సిక స్థితి ఎలా ఉందో అఖిల్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఆ సినిమా కు ప్లాప్ టాక్ రావ‌డంతో కొద్ది రోజుల వ‌ర‌కు అస‌లు బ‌య‌ట‌కు రాలేద‌ని - ఎవ‌రినీ క‌ల‌వ‌లేద‌ని చెప్పాడు. ఆ సినిమాను దాదాపు 30 సార్లు చూశాన‌ని - లోపం ఎక్క‌డ ఉందో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పాడు. ఆ సినిమా ఘోర ప‌రాజ‌యం పాలైంద‌ని అంగీక‌రిస్తున్నాన‌ని అఖిల్ చెప్పాడు. ఆ సినిమా క‌థ‌ను తాను ఒక్క‌డినే విని ఫైన‌ల్ చేశాన‌ని - నాగార్జున గారికి ఎటువంటి సంబంధం లేద‌ని అన్నాడు. ఆ చిత్ర ప‌రాజ‌యానికి పూర్తి బాధ్య‌త త‌న‌దేన‌ని చెప్పాడు.

త‌న రెండో సినిమా హ‌లో క‌థ‌ను విక్ర‌మ్ చెప్పిన త‌ర్వాత తాను చాలా రిలాక్స్ అయ్యాన‌ని - ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని త‌న‌కు అపుడే న‌మ్మ‌కం క‌లిగింద‌ని అన్నాడు. హ‌లో సినిమాను కూడా రాబోయే ప‌ది రోజుల్లో చాలా సార్లు చూస్తాన‌ని - ఒక న‌టుడిగా ఇంకా బెట‌ర్ గా ఎలా పెర్ ఫార్మ్ చేయాలో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాన‌ని అన్నాడు. ఎంసీఏ కు త‌న సినిమాకు పోలిక లేద‌ని - అయితే, ఎంసీఏ తో క్లాష్ వ‌ల్ల హ‌లో క‌లెక్ష‌న్లు కొద్దిగా త‌గ్గాయ‌ని చెప్పాడు. క‌లెక్ష‌న్లు - క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం క‌న్నా ఒక మంచి సినిమా చేశాన‌న్న ఆనందం ఉంద‌న్నాడు. ప్రేక్ష‌కులు రెండు సినిమాలను ఆద‌రించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నాడు. రెండు సినిమాల క‌థ‌లు విన్నాన‌ని వాటిలో ఒక దాన్ని జ‌న‌వ‌రి 10న వాటిలో ఒక‌టి ఫైన‌ల్ చేసి అనౌన్స్ మెంట్ చేస్తాన‌ని చెప్పాడు. త‌న త‌ర్వాతి చిత్ర షూటింగ్ కూడా వెంట‌నే మొద‌లు పెడ‌తాన‌ని చెప్పాడు. ఆ చిత్రాన్ని వేరే నిర్మాణ సంస్థ‌లో చేయ‌బోతున్నాన‌ని అన్నాడు.