Begin typing your search above and press return to search.

అఖిల్ రెండో సినిమాకి మూడో ఆప్షన్

By:  Tupaki Desk   |   23 May 2016 11:30 AM GMT
అఖిల్ రెండో సినిమాకి మూడో ఆప్షన్
X
అఖిల్ అక్కినేని.. అఖిల్ అంటూ తొలి సినిమా రిలీజ్ చేసి 7 నెలలు పూర్తయిపోయినా.. ఇంకా రెండో సినిమా స్టార్ట్ చేయలేదు. మొదటి సినిమా ఇచ్చిన రిజల్ట్ కారణంగా.. రెండో ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి ఛాన్సెస్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే అఖిల్ రెండో సినిమా అంటూ.. రకరకాల ఆప్షన్స్ ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.

ఊపిరితో సక్సెస్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో అఖిల్ రెండో సినిమా ఖాయమైందనే వార్తల తర్వాత.. దీన్ని హోల్డ్ లో ఉంచారనే టాక్ వచ్చింది. రీసెంట్ గా అందమైన చిత్రాలను తీసే దర్శకుడిగా గుర్తింపు పొందిన హను రాఘవపూడి చెప్పిన లైన్ కు. అక్కినేని టీం ఫ్లాట్ అయిందన్నారు. ఇప్పుడు ఓ మలయాళ మూవీ రీమేక్ ని కూడా అఖిల్ కోసం కన్సిడర్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కమ్మటి పాదంకు.. పాజిటివ్ రివ్యూలతో పాటు ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాని అఖిల్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని యోచిస్తున్నారట.

ఇప్పటివరకూ నాగ్ అండ్ టీం ఈ కమ్మటి పాదంను ఇంకా చూడకపోయినా.. ఇమేజ్ ప్రకారం దీని రీమేక్ లో అఖిల్ అయితేనే కరెక్ట్ అంటున్నారు. అలాగే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు అర్జున్ కపూర్ ని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినా.. పట్టాలెక్కేందుకు రెండునెలలకు పైగా పడుతుందని తెలుస్తోంది. మొత్తం మీద తన రెండో సినిమా కోసం అఖిల్ కి మూడు ఆప్షన్స్ లభించడం విశేషం.