Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారిన అఖిల్ ట్వీట్ వీడియో

By:  Tupaki Desk   |   7 Jun 2017 3:01 PM GMT
వైర‌ల్ గా మారిన అఖిల్ ట్వీట్ వీడియో
X
అయితే సినిమాలు. లేదంటే క్రికెట్‌.. ఈ రెండు కాదంటే స‌ర‌దాగా స్నేహితుల‌తో తిరిగే యువ‌హీరో అఖిల్‌.. తాజాగా ట్వీట్ చేసిన ఓ వీడియో అమితంగా ఆక‌ట్టుకుంటోంది. వైర‌ల్ గా మారింది. ఎప్పుడూ లేని విధంగా సామాజిక అంశంపై అఖిల్ ఫోక‌స్ చేయ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లు ఆయ‌న పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అంద‌రి దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది.

బ్రిట‌న్ లోని మాంచెస్ట‌ర్ లో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఓ ముస్లిం యువ‌కుడు చేసిన ప‌ని అక్క‌డ విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. భ‌క్తాష్ నూరీ అనే ముస్లిం యువ‌కుడు ఒక అట్ట మీద కొన్ని వాక్యాలు రాసి.. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకొని రోడ్డు మీద నిలుచున్నాడు. ఆ అట్ట‌ముక్క మీద ఉన్న అక్ష‌రాల్ని చ‌దివిన ప‌లువురు.. అత‌న్ని గాఢంగా హ‌త్తుకుంటూ త‌మ సంఘీభావాన్ని తెల‌ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ.. ఆ అట్ట మీద రాసి ఉన్న మెసేజ్ ఏమిట‌న్న‌ది చూస్తే.. తాను ముస్లిం యువ‌కుడిన‌ని.. త‌న‌పై ఎలాంటి ద్వేష భావం లేద‌నుకున్న వారు త‌న‌ను గాఢంగా కౌగిలించుకోవాల‌న్న మెసేజ్ ను ఆ యువ‌కుడు రాశాడు.

దీన్ని చూసిన ప‌లువురు అత‌న్ని హ‌త్తుకుంటూ.. అత‌డికి త‌మ సంఘీభావాన్ని తెలియ‌జేస్తున్నారు. ఇలా నిలుచున్న ఆ యువ‌కుడికి కొద్దిసేప‌టికి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఉగ్ర‌దాడి బాధితుడైన ఒక వ్య‌క్తి సైతం ఆ ముస్లిం యువ‌కుడిని హ‌త్తుకుంటూ.. త‌న సంఘీభావాన్ని తెలియ‌జేశారు. మాన‌వ‌తా దృక్ఫ‌ధంతో వ్య‌వ‌హ‌రించిన ఈ వైనం వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను అఖిల్ షేర్ చేయ‌టం.. దానికి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. మొత్తానికి అఖిల్ త‌న‌లోని మ‌రో యాంగిల్‌ ను కూడా చూపించాడ‌ని చెప్పాలి.








Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/