Begin typing your search above and press return to search.

రిలీజ్‌కు ముందే కలసుకుంటా -అఖిల్‌

By:  Tupaki Desk   |   26 Jun 2015 5:30 PM GMT
రిలీజ్‌కు ముందే కలసుకుంటా -అఖిల్‌
X
తన అభిమానులను రిలీజ్‌కు ముందే కలుస్తా అంటున్నాడు అక్కినేని అఖిల్‌. నిజానికి లాంచింగ్‌ అవ్వకముందే ఎవరైనా ఓ ఫ్యామిలీ వారసుడికి విపరీతంగా క్రేజ్‌ వచ్చిందంటే అది కేవలం అఖిల్‌కే అని చెప్పాలి. మనోడు ఎప్పుడైతే క్రికెట్‌ ఆడి టాలీవుడ్‌ కళ్ళలో పడ్డాడో.. అప్పటినుండో విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. ఆ దెబ్బతో ఇక సూపర్‌స్టార్‌ అయిపోయాడు. సినిమా ఎప్పుడూ సినిమా ఎప్పుడూ అంటూ ఫ్యాన్స్‌ జపం చేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు ఓ రెండేళ్ళ తరువాత వివి వినాయక్‌ డైరక్షన్‌లో తన తొలి సినిమాను మొదలెట్టేశాడు అఖిల్‌. ఇప్పటికే ఆ సినిమాలోని తన లుక్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక వినాయక్‌ డైరక్షన్‌ అంటే ఆ రేంజ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మనోడి చేతిలో పడితే ఎవరైనా కూడా యాక్షన్‌ హీరోగా ఇరగదీస్తారు. అప్పట్లో దిల్‌ సినిమాతో నితిన్‌ను ఓ సెన్సేషనల్‌ స్టార్‌ చేసిన వినాయక్‌, ఇప్పుడు అఖిల్‌ను కూడా తొలిసినిమాతోనే ఆ రేంజ్‌లో చూపిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేముందే తన అభిమానులను ఓసారి కలసి వారితో చాలా విషయాలను పంచుకోవాలనుందని అఖిల్‌ స్వయంగా ప్రకటించాడు. బ్యాంకాక్‌ షెడ్యూల్‌ పూర్తవ్వగానే వచ్చేస్తాడట.