Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ః ఏజెంట్‌ కోసం సల్మాన్ లా మారిన అఖిల్‌

By:  Tupaki Desk   |   27 Dec 2021 6:28 AM GMT
ఫొటోటాక్ః ఏజెంట్‌ కోసం సల్మాన్ లా మారిన అఖిల్‌
X
అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన అఖిల్ ఎట్టకేలకు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ తో కమర్షియల్‌ గా మొదటి సక్సెస్ ను దక్కించుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా కు మంచి స్పందన వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్‌ చేస్తున్న సినిమా ఏజెంట్‌. స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్‌ రూపొందుతోంది.

ఏజెంట్‌ ఫస్ట్‌ లుక్ విడుదల సమయంలోనే అఖిల్‌ సిక్స్ ప్యాన్‌ ను చూపించాడు. అఖిల్ ను మంచి ఫిజిక్ తో సూరి చూపించబోతున్నట్లుగా ఆ సమయంలోనే తేలిపోయింది. ఒక మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీగా ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. ఏజెంట్‌ సినిమా పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఈ సమయంలో అఖిల్‌ షేర్ చేసిన ఈ ఫొటో సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచాయి. హీరోగా అఖిల్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పడుతున్న కష్టంకు ఈ ఫొటో నిదర్శణం అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ బాడీ నెవ్వర్‌ బిఫోర్‌ ఇన్ టాలీవుడ్‌ అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏజెంట్‌ సినిమా కోసం కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ బాడీని తలపించేలా అఖిల్ తన బాడీని మార్చేసుకున్నాడు.

ఇప్పుడు కాస్త బరువు ఎక్కి కండలు కరిగి పోయాయి కాని ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ కు మరో పేరు కండల వీరుడు అనే విషయం తెల్సిందే. అప్పట్లో సల్లూ భాయ్ కండలు ఎలా ఉండేవో ఇప్పుడు అఖిల్‌ అలాంటి కండలను ఏజెంట్‌ లో చూపించబోతున్నట్లుగా ఈ ఫొటో చూస్తుంటే అనిపిస్తుందనే అభిప్రాయంను నెటిజన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్‌ అక్కినేని ఏజెంట్‌ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లను చేసేందుకు కథలు వింటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏజెంట్‌ సినిమా ను మరీ ఆలస్యం చేయకుండా 2022 ప్రథమార్థంలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలుంటే మరో సినిమాను 2022 లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి బంగార్రాజులో నటిస్తున్నారు. ఇక అఖిల్ తో కూడా నాగార్జున ఒక సినిమాలో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముందు ముందు నటించే అవకాశాలు ఉన్నాయి.. కాని ఇద్దరు హీరోలుగా ఈమద్య కాలంలోనే నటించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి నాగ్‌ అభిమానుల కోరికను తీర్చుతాడా అనేది చూడాలి.