Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ కలలు కల్లలే..
By: Tupaki Desk | 13 March 2017 9:43 AM GMTబండ్ల గణేష్ అందరికీ నటుడిగా.. నిర్మాతగానే తెలుసు. ఐతే అంతకంటే ముందు అతను పౌల్ట్రీ వ్యాపారి అని చాలా తక్కువమందికే తెలుసు. ఐతే ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో తన కోళ్ల వ్యాపారానికి సంబంధించిన చాలా విశేషాల్ని పంచుకున్నాడు బండ్ల. రెండు వేల కోళ్లతో మూడున్నర దశాబ్దాల కిందట బండ్ల కుటుంబం కోళ్ల ఫాం ఆరంభిస్తే.. ఇప్పుడది 25 లక్షల కోళ్లకు చేరుకుందట. తెలంగాణలో తమదే అతి పెద్ద హ్యాచరీస్ వ్యాపారం అని బండ్ల చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే తెలంగాణలో చక్రం తిప్పుతున్న బండ్ల.. ఉత్తరాదిన కూడా జెండా పాతాలని అనుకున్నాడు.
ఉత్తర ప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో ఫాం పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా బండ్ల ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ద్వారా లాబీయింగ్ చేయించి.. యూపీలో భూమి సంపాదించానని.. సీఎం అఖిలేష్ యాదవ్ తక్కువ ధరకే భూమి ఇచ్చాడని చెప్పాడు బండ్ల. ఐతే యూపీ ఎన్నికల తర్వాత అఖిలేష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ తన వ్యాపారం మొదలవుతుందని అన్నాడు బండ్ల. అఖిలేష్ ముఖ్యమంత్రి కాకపోతే ఐదేళ్ల తర్వాతే యూపీలో తన వ్యాపారం మొదలవుతుందని అన్నాడు. ఇప్పుడు అఖిలేష్ ఓడిపోయాడు. బండ్ల ఆశలకు బ్రేక్ పడింది. కొత్తగా అధికారంలోకి రానున్న భాజపా ప్రభుత్వం అఖిలేష్ చేసిన భూ కేటాయింపులన్నింటినీ రద్దు చేస్తుందనడంలో సందేహం లేదు. ఐదేళ్ల తర్వాతైనా అఖిలేష్ మళ్లీ సీఎం అవుతాడా.. అయినా బండ్లకు మళ్లీ భూమి ఇస్తాడా.. అతను అక్కడ పౌల్ట్రీ మొదలుపెడతాడా అన్నది సందేహమే. కాబట్టి బండ్ల కలలకు తెరపడ్డట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/