Begin typing your search above and press return to search.
అక్కినేని మూడో తరం -మూడు సమస్యలు
By: Tupaki Desk | 5 Dec 2018 12:26 PM GMTఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి ఛరిష్మా మైంటైన్ చేసి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా అక్కినేని నాగేశ్వర్ రావు గారి ప్రస్థానం సినిమా చరిత్రలో చాలా ప్రత్యేకమైనది. అందులో సందేహం లేదు. ఆయన వారసుడిగా రెండో తరం బాధ్యతను ఒక్కడే తీసుకున్న నాగార్జున దాన్ని విజయవంతంగా కాపాడుకుంటూ వచ్చాడు. కెరీర్ పాతికేళ్ళు దాటినా ఇప్పటికీ మన్మధుడిగా నీరాజనాలు అందుకుంటూనే ఉన్నాడు. శివ లాంటి ట్రెండ్ సెట్టర్ మొదలుకుని అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రం దాకా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూనే కమర్షియల్ స్టామినాను ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య ట్రాక్ రికార్డు అంతగా లేకపోయినా నాగ్ అనే బ్రాండ్ ఎప్పటికి స్పెషలే.
ఇప్పుడు మూడో తరం నడుస్తోంది. తొమ్మిదేళ్ళ క్రితం నాగ చైతన్య దీనికి సారధి దాకా మూడేళ్ళ క్రితం అన్నయ్యతో పాటు అఖిల్ కూడా ఈ బాధ్యతను తీసుకున్నాడు. కట్ చేస్తే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ బలమైన ప్రభావం చూపించే దిశగా ఇంకా మార్కెట్ ను పెంచుకోలేకపోయారు. ఇక్కడ అక్కినేని మూడో తరంలో మూడు ప్రధాన సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి కథల ఎంపిక. చైతు ఎప్పటికప్పుడు వైవిధ్యంగా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. తన స్టామినాకు మించి కొన్ని రిస్కులు కెరీర్ మొదట్లో చేయడం ఇంకా మూల్యం చెల్లించేలా చేస్తోంది. దర్శకులు సైతం చైతుని ఎలా చూపించాలి అనే విషయంలో క్లారిటీ మిస్ కావడంతో అన్ని తేడా కొట్టేస్తున్నాయి. అఖిల్ ఈ కారణంగానే అనవసరమైన జాప్యం చేయడంతో మూడేళ్ళకు కేవలం రెండు సినిమాలే చేసాడు.
ఇక రెండో సమస్య బడ్జెట్. ఇప్పటిదాకా ముప్పై కోట్ల మార్కును చేరుకోవడం చైతు అఖిల్ ఇద్దరి వల్లా కాలేదు. కాని నిర్మాతలు మాత్రం అంతకు మించి బడ్జెట్ కు సిద్ధపడటం అందరిని రిస్క్ లో పడేస్తోంది. ఇక మూడో సమస్య నాగ్ ఫ్యామిలీ హీరోలు. సుమంత్, సుశాంత్ ఇప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. సుమంత్ వచ్చి ఇరవై ఏళ్ళు దాటుతున్నా తనకంటూ ఒక బ్రాండ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. నాగ్ వారసులు కాకపోయినా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలుగానే చూస్తారు కాబట్టి ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ హోల్ అక్కినేని బ్రాండ్ మీద పడుతోంది. ఈ మూడు సమస్యలు వీలైనంత త్వరగా దాటుకోగలిగితేనే అక్కినేని మూడో తరం బలంగా నిలబడుతుంది.