Begin typing your search above and press return to search.

నాన్నలో ఫైర్ తగ్గలేదు.. ఆకలి తీరలేదు: అఖిల్

By:  Tupaki Desk   |   26 Sept 2022 9:13 AM IST
నాన్నలో ఫైర్ తగ్గలేదు.. ఆకలి తీరలేదు: అఖిల్
X
ప్రస్తుతం అఖిల్ .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ ఇక బయటికి వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటూ ఉండగా, ఆయన 'ది ఘోస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిశాడు.

కర్నూల్ లో అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంటులో అఖిల్ మాట్లాడుతూ .."ఇక్కడ మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున నేను .. చైతూ కూడా కాలర్ ఎగరేస్తున్నాము. నాన్నగారిని అదే ఇన్టెన్సిటీ .. అదే ఫైర్ తో చూస్తున్నాను.

ఈ సినిమాకి సంబంధించిన వీడియోస్ ఇక్కడ చూసిన తరువాత నేను .. అన్నయ్య మాట్లాడుకున్నాము. ఈయనకి ఫ్యాషన్ తగ్గదా? ఈయనకి ఆకలి తగ్గదా? అనుకున్నాము. 30 ఏళ్ల తరువాత కూడా ఆయన అదే క్రమశిక్షణతో .. కసితో పనిచేస్తున్నారు. మా ధైర్యం .. మోటివేషన్ ఆయనే అనే విషయం మాకు అర్థమైంది.

మేము ఇంకా ఎంతగా పరిగెత్తాలనేది మా నాన్నను చూస్తుంటే మాకు తెలిసిపోతోంది. మొదటి నుంచి నేను గమనిస్తూనే వస్తున్నాను. 'ఘోస్ట్' సినిమాలో ఏదో ఫైర్ ఉంది. అక్టోబర్ 5వ తేదీన మీరంతా ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను.

ఈ సినిమా కోసం అంతా ఎంతగా కష్టపడ్డారనేది అవుట్ పుట్ చూస్తేనే తెలిసిపోతోంది. ఈ సినిమా కోసం ఒకటిన్నర .. రెండేళ్లుగా మీరంతా కలిసి చేసిన ప్రయాణం కనిపిస్తోంది. త్వరలో 'ఏజెంట్' సినిమాతో కలుద్దాం" అంటూ ముగించాడు.

అఖిల్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు నాగ్ చెప్పడం ఈ ఫంక్షన్ కి హైలైట్ గా నిలిచింది. అయితే ఏ జోనర్లో .. ఏ డైరెక్టర్ తో చేయనున్నది మాత్రం నాగ్ చెప్పలేదు. దాంతో ఈ విషయంపై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.