Begin typing your search above and press return to search.
‘ఏజెంట్’ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలి!
By: Tupaki Desk | 18 April 2023 10:37 PM GMTయాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు చక్కగా సరిపోయే అఖిల్ అక్కినేని, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో పేరుపొందిన సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ తో మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి చేతులు కలిపారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కాకినాడలో ఏజెంట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ లో ‘ఏజెంట్’ ప్లాట్‌లైన్ గురించి పెద్దగా రివిల్ చేయకుండా క్యురియాసిటీని పెంచారు. ప్రతి పాత్ర పెర్ఫార్మెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, బీజీఏం, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా అన్నిఎలిమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి ఆశించే అన్నిఅంశాలు ట్రైలర్ లో వున్నాయి.
డేరింగ్, డాషింగ్ వైల్డ్‌గా ఉండే పవర్-ప్యాక్డ్ ఏజెంట్ పాత్రలో కనిపించారు అఖిల్. స్క్రీన్ పై కనిపించిన ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా వుంది. అఖిల్ తన స్టంట్స్ , వైల్డ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అతని పాత్ర హైపర్యాక్టివ్‌గా వుండి, కథనానికి ఫ్రెస్ నెస్ ని తీసుకొచ్చింది.
సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా గొప్ప వాల్యుని జోడించారు. ఇందులో సాక్షి వైద్య రొమాంటిక్ ఎపిసోడ్‌లలో అద్భుతంగా కనిపించింది. రసూల్ ఎల్లోర్ ప్రతి ఫ్రేమ్‌ని చాలా స్టైలిష్‌గా క్యాప్చర్ చేసాడు. హిప్ హాప్ తమిళ సంగీతం మరో పెద్ద ఎసెట్. ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఎనర్జీ .. వచ్చే పదిరోజులు రిలీజ్ వరకూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ఏజెంట్ రెండేళ్ళ జర్నీ. ఈ జర్నీని మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఈ జర్నీలో మానసికంగా చాలా మారాను. నాకు సినిమా, అభిమానులు అంటే ఎంత పిచ్చో ఇంకా అర్ధమైయింది. నేను ఇక్కడే వుంటాను మీ కోసం పని చేస్తూనే వుంటాను. మీ అభిమానం గుండెల్లో దాచిపెట్టుకుంటాను. సాక్షి వైద్య ఏజెంట్ లో సర్ ప్రైజ్ ప్యాకేజ్. సినిమా అంటే తనకి ప్రాణం. హిపాప్ తమిళా ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశారు. బీజీఏం చాలా వైల్డ్ గా వుంటుంది. అనిల్ సుంకర గారు నా బ్యాక్ బోన్. అభిమానుల కోసం ఇంత పెద్ద సినిమా చెద్దాం అందరికీ పిచ్చెక్కిపోవాలని అన్నారు. అదే మాట మీద నిలబడ్డారు. ఆయన నా సపోర్ట్ సిస్టం. ఏజెంట్ క్రెడిట్ అంతా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికే ఇస్తాను. నన్ను ఇలా చూపించాలని ఇమాజిన్ చేసింది ఆయనే. నన్ను ఎప్పుడూ ఇలా ఊహించుకోలేదు. ఈ రోజు ఇంత నమ్మకంగా మాట్లడుతున్నానంటే ఏజెంట్ ఇచ్చిన ధైర్యం. ఏజెంట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సురేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అభిమానులు నాపై ఎంత బరువు పెట్టినా దాన్ని మోస్తాను, మీ కోసం వైల్డ్ గా వస్తూనే వుంటాను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన గౌరవ మంత్రిగా గారికి కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలి’’ అన్నారు
మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. ఏజెంట్ ట్రైలర్ చూస్తుంటే మనలోని జోష్ పెరిగిపోతుంది. కాకినాడలో ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. అఖిల్ గారిని మొన్న జంప్ చేసిన విధానం, ఈ రోజు ట్రైలర్ కనిపించిన తీరు చూస్తుంటే హాలీవుడ్ సినిమాల్లో చూసిన స్ఫూర్తి వచ్చింది. ఏప్రిల్ 28న తెలుగు సినిమా అభిమానులంతా ఏజెంట్ ని సూపర్ సక్సెస్ చేస్తారని, సినిమా రికార్డ్ లెవల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అనిల్ సుంకర గారికి, సురేందర్ రెడ్డి గారికి, హీరోయిన్ సాక్షి వైద్యకి టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఏప్రిల్ 28 ప్రేక్షకులు, అభిమానులకు ఒక పండగ, ఉత్సవం. ఏజెంట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ సినిమా తర్వాత ఏజెంట్ అంటే ఒక విగ్రహం గుర్తుకు రావాలని, అది అఖిల్ కావాలి అనుకున్నాం. ఇది సురేందర్ రెడ్డి కోరిక . ఈ కోరికని నెరవేర్చాడు అఖిల్. గత రెండేళ్ళు గా చాలా కృషి చేశాడు. కష్టపడ్డాడు. టీం అంతా కష్టపడి చేసిన సినిమా. యాక్షన్ స్పై జోనర్ ఇది ఇది వరకు సినిమాలు వచ్చాయి కానీ ఏజెంట్ చాలా ప్రత్యేకం. ఆరు దేశాల్లో డిఫరెంట్ లోకేషన్స్ లో మంచి యాక్షన్ కొరియోగ్రఫర్స్ , స్టంట్స్ తో చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి టీం అంతా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మమ్ముట్టి, డినో మోరియా వారి బెస్ట్ ఇచ్చారు. మమ్ముట్టి గారి గొప్పదనం ఈ చిత్రంతో మరోసారి చూస్తారు. మంత్రిగారికి కృతజ్ఞతలు. సక్సెస్ టూర్ కి మళ్ళీ కాకినాడ వస్తాం. ఏప్రిల్ 28 ఒక పండగలా వుంటుంది.’’ అన్నారు,
సాక్షి వైద్య మాట్లాడుతూ.. కాకినాడ రావడం అనందంగా వుంది. ఏజెంట్ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఒక వార్నింగ్... ఏప్రిల్ 28న థియేటర్ లో ఏజెంట్ తో వైల్డ్ రైడ్ కి రెడీ అవ్వండి’’ అన్నారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమిళా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు.