Begin typing your search above and press return to search.

విదేశాల లో అఖిల్ పబ్లిసిటీ

By:  Tupaki Desk   |   3 Sept 2015 1:48 AM IST
విదేశాల లో అఖిల్ పబ్లిసిటీ
X
మునుపెన్నడూ లేనంత క్రేజ్ తో ఒక కుర్ర హీరో తెలుగు తెరకు పరిచయం కేవలం అఖిల్ కు మాత్రమే సొంతమవుతుంది. రామ్ చరణ్ తరువాత అడపాదడపా వంశోద్ధారకులు టాలీవుడ్ లో అడుగుపెట్టినా తొలి సినిమా తోనే హైప్ తెచ్చుకున్న వారు అరుదు.

చిరంజీవి తనయుడి తరువాత అంతటి మాస్ ఎప్పీల్ తో రానున్న అఖిల్ తొలి సినిమా కోసం చాలానే కసరత్తులు తీసుకుంటున్నారు. టాకీ భాగంపూర్తయ్యి రెండు పాటల షూటింగ్ లను మాత్రమే మిగుల్చుకున్న ఈ సినిమాని బాలీవుడ్ తరహాలో ప్రచారం చేయడానికి నడుంకట్టారు.

సినిమా విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల లో ఐదు ప్రధాన నగరాల లో చిత్ర బృందం తరలి వెళ్ళి సినిమా గురించి ప్రచారం చేస్తారట. అక్కడి తో ఆగక ఈ టీమ్ అంతా పబ్లిసిటీ కోసం అమెరికా సైతం వెళ్లనుందని సమాచారం. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా ఖ్యాతి గణనీయంగా పెరిగిన నేపధ్యం లో ఈ కసరత్తులన్నీ సినిమా విడుదల తరువాత లాభాలేనని వారి భావన.