Begin typing your search above and press return to search.
అన్నీ చెప్పినా.. అఖిల్ పెళ్లిపై మాట్లాడని అమల
By: Tupaki Desk | 5 March 2017 7:09 AM GMTకొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటాయి. మామూలు వాళ్లకైతే ఫర్లేదు ఏదోలా మేనేజ్ చేసేయొచ్చు. ప్రముఖులకు అలాంటి అవకాశం ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు అక్కినేని నాగార్జున సతీమణి.. నటి అమల. కొడుకు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ ఇష్యూ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
పెళ్లి వాయిదా పడిందని కొందరు.. కాదు క్యాన్సిల్ అయ్యిందన్న మాటను మరికొందరు చెబుతుండటం.. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నవేళ.. బయటకు రావటం కాస్త ఇబ్బందే. అయితే.. అలాంటి ఇబ్బందిని ఫేస్ చేశారు అమల. నిజానికి ఇబ్బందికర పరిస్థితుల్లో కొందరు ప్రముఖులు అగ్రహం వ్యక్తం చేసి.. ఇష్యూను మరింత పెద్దది చేస్తారు.
తాజాగా అమల మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరించి కూల్ గా తప్పించుకున్నవైనం కనిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో 5కే రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమల అక్కినేని హాజరయ్యారు. అఖిల్.. శ్రేయ వివాహం రద్దు అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు బయట కనిపించటం ఇదే తొలిసారి.
దీనికి తోడు.. ఈ కార్యక్రమం గురించి అమల మీడియాతో మాట్లాడారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయటంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె.. మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు.. అఖిల్ – శ్రేయ వివాహం రద్దు అయ్యిందన్న వార్తల మీద ప్రశ్నించారు. దీనిపై ఏ మాత్రం రియాక్ట్ కాని అమల.. మీడియాకు మరో అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/