Begin typing your search above and press return to search.
అమల బ్యాక్ గ్రౌండ్.. ఆ దేశానికి చెందిన మహిళనా?
By: Tupaki Desk | 8 Jun 2023 8:00 AM GMTఅక్కినేని నాగార్జున సతీమణి, ఒకప్పటి హీరోయిన్ అమల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయిన అమల తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి శివ, నిర్ణయం లాంటి మూవీస్ లో కింగ్ నాగార్జునకి జోడీగా నటించింది. శివ మూవీ అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలా రెండు సినిమాల తర్వాత నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు.
తరువాత కొంతకాలానికి అమలని పెళ్లి చేసుకోవడం జరిగింది. అమల, నాగార్జున కొడుకు అఖిల్. ఇప్పుడు హీరోగా తనని తాను సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ గా ఆవిష్కరించుకునే ప్రయ్యత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు.
నెక్స్ట్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ మూవీ ఒకటి అనిల్ కుమార్ దర్శకత్వంఓ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే అమల సౌత్ లో హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో ఇంచు మించు ఆ రోజుల్లో నటించింది. అయితే అమల బ్యాగ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సౌత్ ఇండియా సినిమాలలో ఎక్కువగా ఆమె నటించారు కాబట్టి సౌత్ కి చెందిన వ్యక్తి అనుకుంటారు.
నిజానికి అమల తండ్రి వెస్ట్ బెంగాల్ కి చెందిన వ్యక్తి వెస్ట్ బెంగాల్ నేవీలో పనిచేసేవారు. తరువాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అమల తల్లి ఐర్లాండ్ కి చెందిన మహిళా. ఆమె తల్లి, తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక విశాఖ నేవీలో కూడా అమల తండ్రి కొంతకాలం పనిచేశారు. అమల తల్లికి సంబందించిన రిలేషన్స్ ఐర్లాండ్ లో ఉన్నారు.
ఇలా అమల బెంగాలీ, ఐర్లాండ్ మూలాలు కలిగి ఉన్న మహిళగా ఉన్నారు. ఆమె సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా చాలా సినిమాలు చేసింది. నిర్ణయం సినిమా తర్వాత అమల, నాగార్జున పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఆమె హీరోయిన్ గా ఆగ్రహం అనే మూవీ మాత్రమే చేసింది. మరల చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యింది.