Begin typing your search above and press return to search.
ఏజ్ విషయంలో పొదుపు పాటించని అమల
By: Tupaki Desk | 14 March 2016 4:23 AM GMTచాలామంది మహిళలు తమ ఏజ్ విషయంలో, రిజర్వడ్ గా ఉంటారు. బయటకు చెప్పేందుకు సాధారణంగా ఒప్పుకోరు. ఒకవేళ చెప్పాల్సొచ్చినా, కొంచెం పొదుపు పాటించి, తగ్గించి చెబుతూ ఉంటారు. కానీ అక్కినేని నాగార్జున సతీమణి అమల మాత్రం తన వయసును ఓపెన్ గా చెప్పేయడమే కాదు.. అందరూ అనుకుంటున్న విషయాన్ని తప్పు అని కూడా చెప్పడం విశేషం.
అమల వయసు ఎంత అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే.. వచ్చే ఆన్సర్ 47. కానీ ఈమె మాత్రం 'నా ఏజ్ ను ఇంటర్నెట్ లో తప్పుగా చూపిస్తున్నారు. నా అసలు వయసు 49' అంటూ రియల్ ఏజ్ చెప్పేశారు. ఒక నటిగా - నాట్యకారిణిగా - జంతు ప్రేమికురాలిగా - సినిమా రంగానికి చెందిన ఇనిస్టిట్యూట్ లో మెంటార్ గా - భార్యగా - తల్లిగా.. ఎన్నో రోల్స్ ని ఒకేసారి పోషించేస్తున్నారు అమల. నాగార్జున లాంటి స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నా.. వీలైనంత వరకూ లో ప్రొఫైల్ లోనే ఉండడం అమల స్పెషాలిటీ. తన చిన్ననాటి సంగతులను కూడా పంచుకున్నారామె.
తన తండ్రి అని తూర్పు బెంగాల్ నుంచి సెటిల్ అయిన శరణార్ధి అని - తల్లి ఐరిష్ దేశస్థురాలని చెప్పిన అమల.. తనకు మొత్తం ఐదు భాషలు వచ్చని అంటున్నారు. అయితే ఏ లాంగ్వేజ్ లోనూ తాను పర్ఫెక్ట్ కాదని అమల ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.