Begin typing your search above and press return to search.

బయట హీరోతో అక్కినేని వారి బిగ్ మూవీ

By:  Tupaki Desk   |   23 Nov 2022 8:30 AM GMT
బయట హీరోతో అక్కినేని వారి బిగ్ మూవీ
X
అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలో వస్తూ ఉండేవి. నాగార్జున కూడా ఎక్కువగా సొంత ప్రొడక్షన్ లోనే అప్పట్లో సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఆ తరువాత జనరేషన్ మాత్రం ఆ సంస్థలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఈ మధ్యకాలంలో సక్సెస్ రేటు బాగా పడిపోవడంతో నాగ్ కూడా సొంత ప్రొడక్షన్ లో రిస్క్ చేయడం లేదు. కనీసం కొడుకులతో కూడా ఆయన సినిమాలను నిర్మించడం లేదు.

నాగ్ ఎంతో నమ్మకంగా అనిపిస్తే గాని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు అనిపిస్తోంది. ఒక విధంగా నాగార్జున డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు అని.. ఆయనది బిజినెస్ మైండ్ చాలా అద్భుతంగా ఉంటుంది అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే ఇద్దరి కొడుకులను బయట సంస్థలతోనే లాంచ్ చేయించాడు.

అయితే నాగార్జున ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో కొడుకుల కంటే ముందే బయట హీరోతో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు నాగచైతన్య మీడియం రేంజ్ సినిమాలతో వెళుతుండగా అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో మొదటి పాన్ సారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.

ఇంకా వీరు అనుకున్నంత స్థాయిలో మార్కెట్ అయితే పెంచుకోలేదు. అయితే తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్లోకి నిలదొక్కుకోవాలని మాత్రం అడుగులు వేస్తున్నారు అనిపిస్తోంది. ఇక నాగార్జున కూడా సొంత ప్రొడక్షన్ కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి తప్పకుండా వారితో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం అయితే లేకపోలేదు.

అయితే ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కూడా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్లో మొదటి పాన్ ఇండియా సినిమాను బయట హీరోలతో చేయడానికి ఒప్పుకున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఆ హీరో మరెవరో కాదు. ఇప్పుడు వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న అడివి శేష్. ఈ విషయంలో అతనే అధికారికంగా క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పటికే మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్లో మేజర్ అనే సినిమాతో ఫ్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న శేష్ ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో హిట్ 2 సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక భవిష్యత్తులో అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయాలని చేయబోతున్నట్లు చెప్పేశాడు. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.