Begin typing your search above and press return to search.

వారి అంచనాలను చై-సామ్ అందుకోవడం లేదు!

By:  Tupaki Desk   |   19 March 2019 8:51 AM GMT
వారి అంచనాలను చై-సామ్ అందుకోవడం లేదు!
X
అక్కినేని నాగ చైతన్య - సమంతా జోడీ నటించిన 'మజిలీ' ఏప్రిల్ 5 న పేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను విడుదల చేయడంతో పాటుగా వరసబెట్టి లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటికి తోడుగా చైతు - సమంతా జంట ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకో కానీ చై-సామ్ లు ఒక విషయంలో మాత్రం ఇంటర్వ్యూలు చేసే ఘనుల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు.

'మజిలీ' సినిమాలో చైతు సమంతాలు భార్యాభర్తలుగా నటించారు. టీజర్ చూస్తేనే అంది కలతల కాపురం అని అర్థం అవుతుంది. దీంతో రీల్ జీవితానికి.. రియల్ లైఫుకు ముడిపెడుతూ 'మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయా?'.. 'రియల్ లైఫ్ లో మీరిద్దరూ ఎలా ఉంటారు?'.. ఇలా అడుగుతూ వారిద్దరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా అని కూపీ లాగేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పాపం అక్కినేని జంటకు ప్రపంచం తల్లకిందులయ్యే టైపు సమస్యలు.. కొట్లాటలు లేకపోవడంతో అలాటిదేమీ లేదని 'అన్యోన్యంగా ఉన్నాం'.. సినిమా వేరు నిజ జీవితం వేరు అని చెప్పుకోవాల్సి వస్తోంది. దీంతో పాపం చైసామ్ లకు విసుగు పుడుతోందట.

ఏదైతేనేం.. ప్రశ్నలు వేసేవారికి 'కావాల్సిన' జవాబులు ఇవ్వడంలో వారి అంచనాలను చై-సామ్ లు ఏమాత్రం అందుకోలేకపోతున్నారు. 'కింగ్' లో బ్రమ్మిగారు చెప్పినట్టు తకిటతకిట 2-4 లో ఉండాలి కానీ.. చైసామ్ 6-8 లో ఉన్నారు! చైసామ్ లు ఏదో ఒకటి చెప్పకపోతారా.. మనం పండగ చేసుకోకపోతామా అన్నట్టుంది ఈ జనాల పరిస్థితి. ఏదో అక్కినేని వారు కాబట్టి సాఫ్ట్ గా ఆన్సర్లు చెబుతున్నారు అదే బాలీవుడ్ హాట్ జోడీ కనుక అయితే రోజూ మేము గిన్నెలతో కొట్టుకుంటాం.. నిద్రపోయేవారిమీద బకెట్ నీళ్ళు పోస్తాం అని చా.. లా ఆసక్తిగా ఉండే అన్సర్లు ఇచ్చి ఉండేవారు.