Begin typing your search above and press return to search.
అఖిల్ ను చూడాలని ఆత్మహత్యాయత్నం
By: Tupaki Desk | 11 Nov 2015 7:03 AM GMTతమ అభిమాన కథానాయకుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అన్నది ఫ్యాన్స్ కి ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇందుకోసం ఏమైనా చేస్తారు. ఎంత ఖర్చయినా పెడతారు. అయినప్పటికీ టికెట్ దొరక్కపోతే ఆ ఫ్రస్టేషన్ లో గొడవలకు దిగడం.. ఆందోళనకు దిగడం మామూలే. ఐతే కర్నూలులో ఇద్దరు అభిమానులు ఏకంగా ఆత్మహత్యాయత్నానికే ప్రయత్నించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖిల్’ సినిమా టికెట్లు దొరకలేదన్న ఆవేదనతో ఇద్దరు ఫ్యాన్స్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని సుసైడ్ అటెంప్ట్ చేశారు.
కర్నూలు లోని ఆనం థియేటర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖిల్ అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని రోజుల ముందే మొదలవగా.. ఆనం థియేటర్ లో మాత్రం విడుదలకు ముందు రోజు టికెట్ల అమ్మకాలు ఆరంభించారు. ఐతే టికెట్ల ధరల్ని బాగా పెంచి అమ్ముతుండటంతో నాగార్జున అభిమానులు ఆందోళన చేపట్టారు. ఇంతలోనే తమకు టికెట్లు దొరకలేదన్న బాధతో ఇద్దరు అభిమానులు తమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐతే కేవలం సినిమా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఎంత వరకు సమంజసం అన్నది ఈ అభిమానులు ఆలోచించకపోవడం విచారకరం.