Begin typing your search above and press return to search.

మెగా, నంద‌మూరి హీరోలు అలా చేస్తే..

By:  Tupaki Desk   |   14 Jan 2016 5:30 AM GMT
మెగా, నంద‌మూరి హీరోలు అలా చేస్తే..
X
లేటెస్టుగా టాలీవుడ్‌ లో ఓ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ మొద‌లైంది. ఉన్న‌ట్టుండి సోగ్గాడే చిన్నినాయ‌న ప్ర‌మోష‌న్ కోసం అక్కినేని హీరోలంతా ఒకే వేదిక‌పైకి వ‌చ్చి పంచెలు ఎగ్గ‌ట్టేశారు. కింగ్ నాగార్జున - నాగ‌చైత‌న్య‌ - అఖిల్ ముగ్గురు తెల్ల లాల్చీ - పంచె క‌ట్టి భ‌లే త‌మాషా చేశారు. ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌ లోకి వ‌చ్చి అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేసేశారు. పంచెలు అదిరిపోయాయ్‌. ఎక్స్‌ ప్రెష‌న్స్ బావున్నాయి. సోగ్గాడే ప్ర‌మోష‌న్ కోస‌మే ఇదంతా చే స్తున్నారా? అస‌లు అక్కినేని హీరోలు ఎందుకిలా చేస్తున్నారు? అన్న సందేహంతో జ‌నాలంతా కొట్టేసుకుంటున్నారు.

అంతేకాదు సేమ్ టైమ్ మ‌రికొన్ని డౌట్స్ కూడా వ‌చ్చాయి. అస‌లు ఈ ఐడియా అక్కినేని హీరోల‌కే ఎందుకొచ్చింది. మెగా హీరోల‌కు - నందమూరి హీరోల‌కు రాలేదేం? ఇలా ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేదిక‌పైకి వ‌చ్చి అభిమానుల‌కు క‌నువిందు చేయాల‌ని ఎందుక‌నిపించ‌లేదు? మెగా హీరోలంతా ఒక సినిమా కోసం ఇలా పంచెలెగ్గ‌ట్టేసి వ‌చ్చేదెప్పుడు? అలాగే నంద‌మూరి హీరోలు బాల‌య్య‌ - ఎన్టీఆర్‌ - క‌ల్యాణ్‌ రామ్ ఒకే వేదిక‌పైకి వ‌చ్చి పంచెలు క‌ట్టే సీన్ ఎప్పుడు ? ఇవ‌న్నీ ఫ్యాన్స్ డౌట్స్‌.

ఏదో కేవలం సంక్రాంతికే కాదు.. అసలు తమ ఫ్యామిలీకి సంబంధించిన ఒక హీరో గురించి ఇతర హీరోలు కూడా ప్రమోట్‌ చేస్తే.. ఆ ఓపెనింగ్స్‌ ఉన్నాయి చూడండీ.. అవి అదరిపోవూ!!