Begin typing your search above and press return to search.

అక్కినేని డిజాస్టర్స్.. ఈ నష్టాలు ఎవరికి రాకూడదు!

By:  Tupaki Desk   |   14 Oct 2022 2:30 AM GMT
అక్కినేని డిజాస్టర్స్.. ఈ నష్టాలు ఎవరికి రాకూడదు!
X
అక్కినేని హీరోలు కొన్నిసార్లు ఫుల్ జోష్లో బాక్సాఫీస్ వద్ద చాలా సందడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఆ సందడి తర్వాత మళ్లీ వెంటనే మరొక డిజాస్టర్ తో డీలా పడిపోతూ ఉంటారు. ఒక విధంగా నాగర్జున అయితే తన మార్కెట్ ఎలా ఉన్నా కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం అక్కినేని వారికి ఏమాత్రం హెల్ప్ కాలేదు అనే చెప్పాలి. ఈ ఏడాది మొదట్లో వచ్చిన బంగార్రాజు సినిమా సంక్రాంతి ఫెస్టివల్ అలాగే సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో కంటెంట్ అంతగా గొప్పగా ఏమీ లేకపోయినా బాగానే ఆడేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్లో టికెట్లు రేట్ల ప్రభావం అన్నప్పటికీ సినిమా మార్కెట్ ను ఆచితూచి మ్యానేజ్ చేయడంతో పెట్టిన పెట్టుబడి అయితే వెనక్కి వచ్చేసింది. అలాగని ఓ గొప్ప లాభాలు ఏమీ రాలేదు. 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే కరెక్ట్ గా అదే స్థాయిలో మళ్లీ మొత్తం షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది సమ్మర్లో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని నాగచైతన్య థాంక్యు సినిమాతో వచ్చాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలకు ముందే అసలు ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 24 కోట్ల వరకు బిజినెస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం నాలుగు కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో దాదాపుగా 20 కోట్ల వరకు నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇక నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

ఈ సినిమా కూడా 22 కోట్ల వరకు బిజినెస్ చేయగా బాక్సాఫీస్ వద్ద కనీసం అందులో సగం కూడా షేర్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. దాదాపు 15 నుంచి 16 కోట్ల మధ్యలో నష్టాలను కలిగినట్లు సమాచారం. అక్కినేని హీరోలకు ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. నాగచైతన్య 20 కోట్లు నాగార్జున 15 కోట్ల వరకు నష్టాలు చూడడమంటే తదుపరి సినిమాల మార్కెట్ పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి రాబోయే అఖిల్ ఏజెంట్ తో అయినా అక్కినేని ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తాడో లేదో చూడాలి.