Begin typing your search above and press return to search.

అక్కినేని లేడీ 'ఏజెంట్'

By:  Tupaki Desk   |   21 April 2021 12:30 PM GMT
అక్కినేని  లేడీ ఏజెంట్
X
ఓ ప్రక్కన అఖిల్ ..ఏజెంట్ గా కనపించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న స్పై థ్రిల్లర్ లో ఆయన రా ఏజెంట్ గా చేయబోతున్నారు. అయితే ఇప్పుడు లేడీ ‘రా’ ఏజెంట్‌ గా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. అయితే ఆమె ఈ సినిమాలో కాదనుకోండి. అఖిల్ తండ్రి అక్కినేని నాగార్డున చేస్తున్న చిత్రంలో ఆమె పోషించే పాత్ర ‘రా’ ఏజెంట్‌. పెళ్లి తర్వాత ఆమె స్పీడు మరింత పెంచింది. తన పాత్రలు కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా చూసుకుంటోంది. స్టార్ హీరోయిన్ నుంచి సీనియర్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె కథాంశాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ ఉంటోంది. తను చేస్తున్న పాత్రల్లో వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం కాజల్ తెలుగులో నాగార్జున జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ ‘రా’ ఏజెంట్‌గా పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తోందట. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు. ఎంతటి ఎమోషన్స్ ను అయినా తనలోనే అణచుకుంటూ దేశభక్తితో వృత్తినే దైవంగా భావించే ‘రా’ ఏజెంట్‌ పాత్రలో ఆమె నటన సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఇక ఇది కాజల్‌ కెరీర్‌లోనే సవాలుతో కూడుకున్న పాత్ర ఇదని..దీనికోసం ఆమె ,డైట్, బాడీ ఫిట్నెస్ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిసింది. రీసెంట్ గా ఈ చిత్రం గోవాలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారు.వస్త్రధారణ మొదలుకొని బాడీలాంగ్వేజ్‌ వరకు ప్రతి అంశంలో కాజల్‌ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ తీసుకోనుంది’ అని చిత్ర టీమ్ తెలిపింది. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది కాజల్‌ అగర్వాల్‌.