Begin typing your search above and press return to search.

వీఐపీ డైరెక్షన్ లో ఆఫీసర్

By:  Tupaki Desk   |   31 May 2018 4:20 AM GMT
వీఐపీ డైరెక్షన్ లో ఆఫీసర్
X
టాలీవుడ్ హీరో నాగార్జున మరోసారి తమిళ ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోయాడు. అప్పట్లో హీరోయిన్ సుస్మితాసేన్ తో కలిసి రక్షకుడు అనే భారీ బడ్జెట్ మూవీ చేశాడు. అది తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైంది. తాజాగా కోలీవుడ్ హీరో కార్తితో కలిసి నటించిన ఊపిరి సినిమా తమిళంలో తొళ పేరుతో విడుదలైంది.

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్ ఓ తమిళ హీరోతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీఐపీ తో టాలీవుడ్ లో పాపులర్ అయిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. తన మామ... సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి హీరో ధనుష్ ప్లాన్ చేసుకున్నాడు. ఈమధ్య కాలంలో తమిళనాడులోని రాజకీయ పరిస్థితుల కారణంగా రజనీకాంత్ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టడంతో ధనుష్ ప్రాజెక్టు పెండింగ్ లో పడింది. ఇదే సబ్జెక్టును నాగార్జునకు వినిపించడంతో ఇంప్రెస్ అయ్యాడు. దర్శకుడిగానూ ధనుష్ కు మంచి పేరు ఉండటంతో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు.

నాగ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఆఫీసర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా నాచురల్ స్టార్ నానితో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో తెరకెక్కుతోంది. ఇదిగాక నాగ్ కు ఇతర కమిట్ మెంట్లు ఏమీ లేనందున ధనుష్ సినిమా త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశముంది.