Begin typing your search above and press return to search.

ముందు అమ్మాయిని కాపాడితే చాలు

By:  Tupaki Desk   |   17 Jan 2016 11:30 AM GMT
ముందు అమ్మాయిని కాపాడితే చాలు
X
మొన్ననే గీతాంజలి సినిమా చేశాకే తన కెరియర్‌ మారిందని.. ఆ సినిమాతో తనలోని సెన్సిబిలిటీస్‌ తాను వెతుకున్నానని సెలవిచ్చిన కింగ్‌ నాగార్జున.. ఇప్పుడు తన చిన్న కొడుకు అఖిల్‌ కోసం మరో మాట చెప్పారు. ఇవన్నీ అఖిల్‌ వింటున్నాడో లేదో తెలియదు కాని.. నాగ్‌ చెప్పిన విషయాలను అక్షరాలా పాటిస్తే మాత్రం అతగాడికే లాభం చేకూరుతుంది.

''ప్రస్తుతం పెద్దాడు చైతన్య కెరియర్‌ అంతా బాగానే ఉంది. వాడు తన పంథాకు సరిపోయే సినిమాలను చేస్తూ పోతున్నాడు. కాని చిన్నాడే. వాడూ చాలా కష్టపడ్డాను కాని.. అప్పుడే ప్రపంచాన్ని సేవే చేసే వీరుడు అంటే ఎవరూ నమ్మరు. ముందుగా తన ప్రియురాలిని తను సేవ్‌ చేసుకోవడం వంటి సినిమాలు చేయాలి. అమ్మాయిని కాపాడితే చాలు.. ప్రపంచం తరువాత'' అంటూ చెప్పుకొచ్చాడు కింగ్‌ నాగ్‌.

ఏమయ్యా అఖిల్‌.. వింటున్నావా? డ్యాడ్‌ చెప్పింది ముమ్మాటికీ నిజం. మాస్‌ హీరో అవ్వడానికి కాస్త టైమివ్వు. అప్పుడే ఆడియన్స్‌ ఒప్పుకోకపోవచ్చు. చుట్టూ ఉన్న వాళ్లు చెబుతారులే.. ఈ స్ర్కిప్టు చేయకపోతే నువ్వు లైఫ్‌ లో చాలా మిస్సయిపోతున్నావ్‌ అని.. కాని ఎప్పటికప్పుడు అలాంటి కథలు పుడుతూనే ఉంటాయి. సో. ముందు సెన్సిబిలిటీకి మ్యాచ్‌ అయ్యే కథను చెయ్యి.