Begin typing your search above and press return to search.
'ఊపిరి' వంద కోట్లు సాధిస్తుందా..?
By: Tupaki Desk | 13 March 2016 6:50 AM GMTనాగార్జున నటించిన 'ఊపిరి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు 50 కోట్లకు పైనే ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఈచిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. సోగ్గాడే పేరు చెప్పి ఊపిరి సినిమాను మంచి రేట్లకే అమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ఎంత రికవరీ చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా నాగార్జున తన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా 50 కోట్ల షేర్ సాధించిందని ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.
అలానే 'వసూలు చేసిన దాంట్లో సగం కంటే తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీసాం. ఇలా మంచి లాభాలు వచ్చినపుడే నిజమైన సక్సెస్ అని అర్థం. 50 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకు 50 కోట్ల వసూళ్లు వస్తే ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు' అని వ్యాఖ్యానించారు. కాబట్టి నాగ్ నటించిన 'ఊపిరి' సినిమా అరవై కోట్లు పెట్టుబడి పెడితే ఓ వంద కోట్లు అయినా వస్తేనే హిట్ అయినట్లు లెక్క, అలాగే లాభాలు వచ్చినట్లు, ఎవరికైనా ఫలితం ఉన్నట్లు. కాబట్టి నాగార్జున అన్న మాట ఈ సినిమాకు వర్తిస్తుందో లేదో చూడాలి..!