Begin typing your search above and press return to search.
ఏఎన్నార్ గొప్ప నటుడు.. అంతేనా???
By: Tupaki Desk | 20 Sep 2015 9:45 AM GMT90 ఏళ్ల జీవితం.. అందులో 75 ఏళ్లు నటనకే అంకితం. సరిగా ఊహ కూడా తెలియని వయసులో మొదలైన నట ప్రస్థానం.. తన ప్రాణం ఇంకెంతో కాలం నిలవదని తెలిశాక కూడా కొనసాగిందంటే ఆ వ్యక్తికి నటన అంటే ప్రాణం అని వేరే చెప్పాల్సిన పని లేదు. సినిమానే జీవితంగా సాగిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకత అదే. ఐతే అక్కినేని లాంటి మహానటులు చాలా పరిశ్రమల్లో చాలామంది ఉండొచ్చు. నటనలో ఆయన్ని మించిన వాళ్లు ఉండొచ్చు. కానీ విలువలతో జీవితం సాగించి.. తన జీవితాన్నే ఓ వ్యక్తిత్వ వికాస పాఠంగా తర్వాతి తరాలకు అందించిన నటుడిగా అక్కినేనికి సాటి వచ్చే వాళ్లు మాత్రం చాలా తక్కువమంది. అక్కినేని గొప్పదనాన్ని నటన కోణంలోంచి మాత్రమే చూస్తే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదు.
నాలుగో తరగతికే చదువు మానేసిననా.. ఇంగ్లిష్ రాక అవమానాలు ఎదుర్కొన్నా.. పట్టుబట్టి ఇంగ్లిష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడటం ద్వారా ఈ తరం యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచారు అక్కినేని. ఆహారపు అలవాట్లయినా.. నడత అయినా.. మాట అయినా.. ప్రతి విషయంలోనూ ఆయన ఎంచుకున్న దారి మనందరికీ ఓ పాఠమే.
ఓ వ్యక్తి ఎంతగా పరిణతి చెందినా.. తనను మృత్యువు కబళించబోతోందనే సరికి నీరుగారి పోతాడు. క్యాన్సర్ లాంటి మహమ్మారి సోకిందంటే నీరసించి పోతాడు. కానీ ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు క్యాన్సర్ ఉందని.. నవ్వుతూ ప్రకటించిన ధీశాలి ఏఎన్నార్. ఇలాంటి దృశ్యాన్ని ఇంకెక్కడా చూసి ఉండం. తనకు వచ్చిన జబ్బు గురించి ఎంతో పరిశోధించి.. వైద్యుల తరహాలు వివరాలు చెప్పడం ఆయనకే చెల్లింది. తనకెవరూ ఫోన్ చేసి జాలి చూపించే ప్రయత్నం చేయొద్దని ఘాటుగా హెచ్చరించడంలో కనిపిస్తుంది అక్కినేని వారి ప్రత్యేకత. ఇంకెన్నో రోజులు బతకనని తెలిసి కూడా ‘మనం’ షూటింగులో పాల్గొనడం.. చివరి రోజుల్లో కుటుంబాన్నంతా దగ్గరికి పిలిపించుకుని.. నవ్వుతూ జీవితం నుంచి సెలవు తీసుకోవడం.. ఏఎన్నార్ విశిష్టత. పరిపూర్ణ జీవితం అనుభవించి.. మనిషి ఎలా బతకాలో చూపించినా అక్కినేని తెలుగువారి గుండెల్లో చిరకాలం బతికే ఉంటారు. ఈ రోజు ఆ మహానుభావుడి జయంతి.