Begin typing your search above and press return to search.

ఎంబీ40లో.. ఆ మూడు వంశాలు లేవెందుకో

By:  Tupaki Desk   |   18 Sept 2016 5:00 PM IST
ఎంబీ40లో.. ఆ మూడు వంశాలు లేవెందుకో
X
విశాఖలో సుబ్బిరామి రెడ్డి బర్త్ డే.. మోహన్ బాబు 40 ఏళ్ల ప్రస్థాన ఉత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమానిక తెలుగు సినీ రంగం నుంచే కాకుండా.. సౌత్ నుంచి దిగ్గజాలు విచ్చేశారు. పలువురు రాజకీయ నాయకులు కూడా భాగమయ్యి.. మోహన్ బాబుకు అభినందనలు తెలిపారు. కానీ.. టాలీవుడ్ ని ఏలుతున్న మూడు కుటుంబాల నుంచి ఒక్కరు కూడా ఎంబీ40లో కనిపించలేదు.

మొదటగా అక్కినేని వంశం గురించి చెప్పుకుంటే.. మోహన్ బాబుకు నాగార్జున క్లోజ్. కానీ.. ఈయన వ్యక్తిగత కారణాలతో.. తప్పనిసరి పనులు ఉండడంతోనే హాజరు కాలేదని తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కరూ రిప్రజెంట్ చేయలేదు. ప్రస్తుతం బాలయ్య మధ్యప్రదేశ్ లో ఉండి రాలేకపోయినా.. జూనియర్ ఎన్టీఆర్ హైద్రాబాద్ లోనే ఉండి కూడా గైర్హాజరయ్యాడు. వీరి తర్వాత ఘట్టమనేని కుటుంబం నుంచి కూడా ఎంబీ40లో ఎవరూ కనిపించలేదు. మహేష్ బాబు ప్రస్తుతం చెన్నైలో మురుగదాస్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు.

మూడు వంశాల నుంచి రిప్రజెంటేషన్ లేకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. మరోవైపు.. మోహన్ బాబు బిగ్గెస్ట్ ఫ్రెండ్ అయిన రజినీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయాడు. ఇందుకు కారణం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిలేకపోవడమే.