Begin typing your search above and press return to search.
అక్కినేని వారికి ఆ ఆసక్తి లేదా?
By: Tupaki Desk | 17 April 2022 1:30 AM GMTటాలీవుడ్ లో ఇప్పడు ఎవరిని కదిపినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. దక్షిణాదిలో మరీ టాలీవుడ్ నుంచే అత్యధికంగా పాన్ ఇండియా చిత్రాల పరంపర మొదలైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం 'బాహుబలి'తో ఈ తరహా చిత్రాల దండయాత్ర మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ బాహుబలి సిరీస్ చిత్రాలు దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హాట్ లుగా నిలవడంతో అదే స్ఫూర్తితో తెలుగులో ఇప్పడు చాలా చిత్రాలు మొదలయ్యాయి. ఇటీవల బన్నీ హీరోగా నటించిన 'పుష్ప' కూడా పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది.
ఈ చిత్రం ఉత్తరాదిలో హిందీ వెర్షన్ కు గానూ 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం ఇప్పటికీ బాలీవుడ్ లో చర్చనడుస్తూనే వుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా.. ఏ స్టార్ కూడా ప్రచారం చేయకుండా ఇది ఎలా సాధ్యమైందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఇదిలా వుంటే రీసెంట్ గా విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'ట్రిపుల్ ఆర్' పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించి చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ప్రభంజనం బాక్సాఫీస్ ని అతలాకుతలం చేస్తున్న వేళ మోన్ స్టార్ గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలై రికార్డుల్ని తిరగరాస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది కూడా.
త్వరలో మరి కొంత మంది హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ వద్ద దాడికి రెడీ అయిపోతున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ హీరోస్ మాత్రం ఈ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కింగ్ నాగార్జున కానీ, అక్కినేని నాగచైతన్య, అఖిల్ కానీ పాన్ ఇండియా మూవీస్ కోసం ప్రయత్నాలు చేయడం లేదు. ఆ వైపుగా కూడా ఆలోచించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున్ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ - అలియా భట్ లతో కరణ్ జోహార్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర' లో నటిస్తున్నారు. ఇందులో ఆయన హీరో కాదు. కీలక పాత్ర మాత్రమే చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లాల్ సింగ్ చద్దా'. ఈ చిత్రంలో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. తనది ఇందులో కీ రోల్ మాత్రమే. ఇందులో హీరో అమీర్ ఖాన్. దీంతో ఇది చై మూవీ కాదు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీసే అయినా ఇందులో నాగ్, అఖిల్ సోలో హీరోలుగా నటించడం లేదు కాబట్టి ఇవి వారి పాన్ ఇండియా మూవీస్ గా పరిగణలోకి రావు.
సోలోగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, యష్ ల తరహాలో సోలో హీరోగా చేస్తేనే పరిగణలోకి వస్తుంది.. అయితే ఇప్పడు అక్కినేని అఖిల్ 'ఏజెంట్' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెకక్ట్ చేస్తున్న ఈ మూవీలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారా అనే విషయంపై ఇప్పటికీ ప్రొడక్షన్ కంపనీ నుంచి ఎలాంటి వార్త లేదు. ఆగస్టు 12న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.