Begin typing your search above and press return to search.

కోడలు సమంతకు అప్పుడే బాధ్యతలు

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:53 PM GMT
కోడలు సమంతకు అప్పుడే బాధ్యతలు
X
సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు అఫీషియల్ గానే తెలుగింటి కోడలు. సుదీర్ఘ కాలంగా అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. మన సాంప్రదాయాల ప్రకారం నిశ్చితార్దం అయితే సగం పెళ్లి జరిగిపోయినట్లే.

అంటే ఇప్పుడు అధికారికంగానే ఈ తమిళమ్మాయి.. తెలుగింటి కోడలు అయిపోయిందన్న మాట. నిన్నటికి నిన్నే చైతు-సమంత నిశ్చితార్ధం అంగరంగవైభవంగా జరిగింది. తెల్లారేసరికల్లా ఆమెకు బాధ్యతలు అప్పగించేశారు. అయితే.. ఇలా బాధ్యతలు చేతిలో పెట్టింది అక్కినేని ఫ్యామిలీ కాదు.. తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రచారం చేసేందుకు.. తెలుగింటి కోడలు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది తెలంగాణ సర్కార్. కేటీఆర్ చేతుల మీదుగా ఈ బాధ్యతలు అందుకోవడమే కాదు.. హ్యాండ్ లూమ్స్ తో సందడి చేసింది సమంత.

సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేసే మంత్రి కేటీఆర్.. ఎంత యాక్టివ్ గా ఉంటారో.. ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. చెయ్-శామ్ ల నిశ్చితార్ధం గురించి ఇంకా జనాలు హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. ఆమె చేతికి ఈ బాధ్యతలు చేతిలోపెట్టేశారు కేటీఆర్.