Begin typing your search above and press return to search.

నాగ్ మేనల్లుడు ప్రేమలో పడ్డాడట

By:  Tupaki Desk   |   29 July 2018 6:43 AM GMT
నాగ్ మేనల్లుడు ప్రేమలో పడ్డాడట
X
ఎంత సినిమా హీరోలైనా ఏదో ఒక దశలో ప్రేమలో పడకుండా ఉండరు. అది సినిమాల్లోకి రాకముందు కావచ్చు.. వచ్చాక కావచ్చు. వాళ్లను ఆకర్షించిన అమ్మాయిలు లేకుండా పోరు. తాను కూడా అందుకు మినహాయింపు కాదంటున్నాడు అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో సుశాంత్. సినిమాల్లోకి రాకముందు.. కాలేజీ రోజుల్లోనే అతను ప్రేమలో పడ్డాడట. ఐతే తాను ప్రేమించిన అమ్మాయికి కనీసం ఐలవ్యూ కూడా చెప్పలేకపోయాడట సుశాంత్. అతను తన సీనియర్‌ ను ప్రేమించినట్లు వెల్లడించడం విశేషం. సినిమాల్లోకి రావాలనుందని ఇంట్లో వాళ్లకు ముందే చెప్పినప్పటికీ.. కనీసం ఒక డిగ్రీ తెచ్చుకున్నాకే తెరంగేట్రం అని తేల్చేయడంతో కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేశాడట సుశాంత్.

ఆ సందర్భంగా ఒక సీనియర్ ను ఇష్టపడ్డాడట. సుశాంత్ బ్యాచిలర్ డిగ్రీ చేసేటపుడే ఆ అమ్మాయి మాస్టర్స్ చదువుతుండేదట. ఇద్దరూ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారట. కొన్ని రోజుల తర్వాత తనకు విషయం చెబుదాం అనుకునేసరికే ఆమె కాలేజీ వదిలేసి వెళ్లిపోయిందట. దీంతో తన ప్రేమ మనసులోనే దాచుకున్నానని.. ఆమెకు ఎప్పటికీ విషయం చెప్పలేదని సుశాంత్ వెల్లడించాడు. ఇక సినిమాల్లోకి వచ్చాక చాలామంది అమ్మాయిలు బ్లాంక్ కాల్స్ చేసి ప్రపోజ్ చేసినట్లు సుశాంత్ తెలిపాడు. దశాబ్దం కిందట ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుశాంత్ ఇప్పటిదాకా హిట్టు కొట్టలేదు. ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘చి ల సౌ’ మంచి టీజర్.. ట్రైలర్లతో ఆకర్షిస్తోంది. ఇందులో హిట్టు కళ కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఒక అమ్మాయిని పెళ్ళిచూపులు చూసి 24 గంటల్లోగా పెళ్లికి సిద్ధపడే కుర్రాడి పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడు. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.