Begin typing your search above and press return to search.

కందిరీగ బ్యూటీ.. బాలీవుడ్ టు కజకిస్థాన్

By:  Tupaki Desk   |   28 Nov 2016 5:30 PM GMT
కందిరీగ బ్యూటీ.. బాలీవుడ్ టు కజకిస్థాన్
X
టాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసినా.. కందీరిగతో మాత్రం మంచి హిట్ కొట్టింది అక్ష పర్దేశానీ. డిక్టేటర్ లో బాలయ్య మూవీలో కూడా నటించినా.. ఈ భామకు బ్రేక్ రాలేదు కానీ.. ఆ తర్వాత ఓ బాలీవుడ్ మూవీ మాత్రం చేతిలోకి వచ్చింది. 'లవ్ యు ఫ్యామిలీ' అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో సల్మాన్ యూసఫ్ ఖాన్(ఏబీసీడీ ఫేమ్)తో కలిసి నటిస్తోంది అక్ష. ఈ చిత్రం కోసం ఏకంగా కజకిస్థాన్ లో షూటింగ్ చేసేస్తున్నారు.

ఈ దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా లవ్ యు ఫ్యామిలీ రికార్డు సృష్టించేస్తోంది. 'ఇక్కడి ప్రజలు చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారు. అనుమతుల కోసం సాయం చేసేందుకు స్వచ్ఛంగా ముందుకొస్తున్నారు. హిందీ ఫిలిమ్స్ చూస్తామని చెబుతున్న కజకిస్థాన్ ప్రజలు బాలీవుడ్ ట్యూన్స్ కు డ్యాన్సులు వేస్తుండడం విశేషం. రాజ్ కపూర్.. మిథున్ చక్రవర్తిలకు ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు' అని చెబుతోంది అక్ష.

'ఓ కేబుల్ కార్ లో 20 నిమిషాలు ప్రయాణించాక జెైలిస్కై పర్వత పాదాల దగ్గరకు చేరుకున్నాం. ఈ ప్రాంతంలో ప్రకృతి అందం చూసి అందరం మైమరిచిపోయాం. ఇప్పటివరకూ భారతీయులు చూడని కజకిస్థాన్ అందాలను దర్శకుడు సచ్చీంద్ర శర్మ ఇండియన్ ఆడియన్స్ కు చూపబొతున్నాడు' అంటూ బాలీవుడ్ సినిమా చేస్తున్న ఆనందాన్ని పంచుకుంది అక్ష.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/