Begin typing your search above and press return to search.

రాధతో రుక్మిణిగా.. కొత్త క్యారెక్టర్

By:  Tupaki Desk   |   4 May 2017 5:46 AM GMT
రాధతో రుక్మిణిగా.. కొత్త క్యారెక్టర్
X
పదేగేళ్లుగా నాలుగు ఫిలిం ఇండస్ట్రీలలో చక్కర్లు కొట్టేస్తోంది అందాల భామ అక్ష పర్దాసానీ. కెరీర్ మొదట్లోనే కుర్ర హీరోలతో అవకాశాలు పట్టేసిన అక్ష.. ఆ తర్వాత స్లో అయిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేసినా బ్రేక్ రాకపోవడంతో.. మలయాళం.. హిందీ.. తమిళ్ భాషల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించేసుకుంది.

ఈ మధ్య హీరోయిన్ కేరక్టర్స్ రావడం లేదు కానీ.. కేమియోల్లో బాగానే కనిపిస్తోంది. బెంగాల్ టైగర్ లో కేమియో చేసిన అక్ష.. డిక్టేటర్ లో కూడా కీలక పాత్ర చేసింది. ఇప్పుడు రాధ అంటూ అల్లరి పోలీస్ గా ఉంటూనే సీరియస్ రోల్ చేస్తున్న శర్వానంద్ సినిమాలో నటించింది అక్ష. తాజాగా ఇచ్చిన పోస్టర్ లో.. హీరోయిన్ తో సమానంగా మెరిసిపోతూ కనిపించిన అక్షను చూసి అంతా షాక్ తినేశారు. 'ఇది నాకు చాలా కొత్త తరహా కేరక్టర్. ఆడియన్స్ ఇప్పటివరకూ నన్ను ఇలా చూసి ఉండరు. కందిరీగ మాదిరిగానే రాధలో నన్ను ఓ విభిన్నమైన కోణంలో ప్రేక్షకులు చూస్తారు. అయితే.. రుక్మిణి పాత్ర తీరుగా నేను నిజ జీవితంలో ఉండను' అని చెప్పింది అక్ష.

అయితే.. రాధలో తను చేస్తున్నది కేమియో కాదని.. ఎక్స్ టెండెడ్ కేమియా అనుకోవచ్చని చెప్పింది అక్ష. తనపై ఓ పాట కూడా ఉంటుందన్న ఈ భామ.. సినిమాలో సాంప్రదాయంగా కనిపించినా.. పాటలో మాత్రం అందాలన్నీ చూపించేశానని చెప్పి తెగ ఊరించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/