Begin typing your search above and press return to search.

మూడో హీరోయిన్‌ గానే మిగిలిపోయిందే

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:30 AM GMT
మూడో హీరోయిన్‌ గానే మిగిలిపోయిందే
X
బొద్దుగుమ్మ అక్ష యువ‌త సినిమాతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది. కందిరీగ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఎందుక‌నో కెరీర్ ఆశించినంత జెట్‌ స్పీడ్ అందుకోలేదు. చిన్నా చిత‌కా అవ‌కాశాలతోనే స‌రిపెట్టుకోవాల్సొచ్చింది. ఇటీవ‌లి కాలంలో బొత్తిగా తెలుగు తెర‌కి దూర‌మైపోయింది. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించింది.

అయితే కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. అయితే వీటిలో ప్ర‌ధాన నాయిక కాదు. కేవ‌లం అతిధి పాత్ర‌లు. బాల‌య్య బాబు హీరోగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న డిక్టేట‌ర్ మూవీలో ఓ అతిధి పాత్ర‌లో న‌టిస్తోంది. అది మూడో హీరోయిన్‌ పాత్రే. అల్రెడీ ఆ సినిమా అంజలి - సోనాల్‌ చౌహాన్‌ హీరియన్లంటే.. ఈ భామది మూడో పాత్రేగా మరి. ఇకపోతే ర‌వితేజ స‌ర‌స‌న బెంగాళ్ టైగ‌ర్‌ లో ఓ హీరోయిన్‌ గా ఆడిపాడుతోంది అమ్మడు అక్ష. ఇక్కడ కూడా తమన్నా - రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్లను. అంటే మళ్ళీ మూడో హీరోయినే అనమాట. చూస్తుంటే ఇలా మూడో హీరయిన్‌ గా మిగిలిపోయేలా ఉంది కదూ.

సర్లేండి.. మెంట‌ల్ పోలీస్ అనే చిత్రంలో మాత్రం ప్రధాన నాయిక‌గా న‌టిస్తోంది. అందం ఉంది, అభిన‌యం ఉంది. కానీ హైటు త‌క్కువ‌. ఇదే ఈ అమ్మ‌డికి కొంత మైన‌స్ అయ్యి ఉండొచ్చు. అలాగే ల‌క్ కూడా క‌లిసి రాలేదు కాబ‌ట్టి స్టార్‌ డ‌మ్ అందుకోలేక‌పోయింది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో క‌నిపిస్తున్న‌ది అతిధి పాత్ర‌లే అయినా వాటితో క్రేజు తెచ్చుకుంటే మ‌రిన్ని ఛాన్సులుంటాయ్‌.