Begin typing your search above and press return to search.

అక్ష‌ర హాస‌న్ పై బాలీవుడ్ మీడియా గుర్రు

By:  Tupaki Desk   |   24 March 2017 6:32 AM GMT
అక్ష‌ర హాస‌న్ పై బాలీవుడ్ మీడియా గుర్రు
X
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. నార్త్ - సౌత్ అన్న తేడా చాలా రంగాల్లో ఉంద‌న్న విష‌యాన్ని ఒప్పుకోక త‌ప్ప‌దు. రాజ‌కీయ రంగంతో పాటు.. సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ ఈ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తూ ఉంటుంది. సౌత్‌ లో ఎంత పీకినా.. నార్త్ మీడియా క‌వ‌ర్ చేసేది అంతంత మాత్ర‌మే. అందుకే.. సౌత్ నుంచి వెళ్లే వారికి కాస్త ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ష‌మితాబ్‌లో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్ హాస‌న్ చిన్న‌కూతురు అక్ష‌ర హాస‌న్‌.. తాజాగా లాలీ కీ షాదీ మే ల‌డ్డూ దీవానా చిత్రంలో న‌టించింది. ఈ సినిమా త‌న‌కు అదృష్టంగా మారుతుంద‌న్న ఆశ‌తో ఉంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ లో బిజీబిజీగా ఉంది. అయితే.. ఇటీవ‌ల ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధుల‌పై అక్ష‌ర హాస‌న్ చిర్రుబుర్రులాడిన వైనం బాలీవుడ్ మీడియాను హ‌ర్ట్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.
హెల్త్ బాగోకున్న మీడియా స‌మావేశానికి వ‌చ్చిన ఆమె.. ముందుగా చెప్పిన దాని కంటే ఎక్కువ‌సేపే ఉంద‌ట‌. డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ కు టైం అవుతున్న వేళ‌.. త‌న ఇంట‌ర్వ్యూల్ని పూర్తి కాకుండా వెళ్లిపోయేందుకు సిద్ధమైంద‌ట‌. దీంతో.. ప్రెస్ మీట్ ఆర్గ‌నైజ్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్ ఆమెను వారించార‌ట‌. అంతే.. ఆయ‌న‌పై అంతెత్తున ఎగిరి ప‌డింద‌ట‌. అప్ప‌టికే నీర‌సంగా ఉన్న అక్ష‌ర అత‌డిపై మండిప‌డ‌ట‌మే కాదు.. ఇంట‌ర్వ్యూ పూర్తి చేయ‌కుండా వెళ్లిపోయింద‌ట‌. దీంతో అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జ‌ర్న‌లిస్ట్ పైనా ఫైర్ అయ్యింద‌ట‌.

దీంతో.. ఆమెకు క్ర‌మ‌శిక్ష‌ణ‌.. మ‌ర్యాద తెలీదంటూ మీడియా వ‌ర్గాలు మండిప‌డుతున్నాయ‌ట‌. అయితే.. ఆమె ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందే త‌ప్పించి.. ఆమెను అర్థం చేసుకోవ‌చ్చ‌న్న మాట‌ను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట‌ర్ వెన‌కేసుకొచ్చినా.. మీడియా మాత్రం గుర్రుగానే ఉన్న‌ట్లు చెబుతున్నారు. త‌న‌కు త‌ర్వాత ఫోన్ చేసిన అక్ష‌ర‌.. సారీ చెప్పింద‌ని.. మీడియానే ఈ అంశాన్ని రార్ధాంతం చేస్తుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్ చెప్ప‌గా.. ఈ సినిమాలో అక్ష‌ర‌కు జంట‌గా న‌టించిన వివాన్ షా సైతం.. ఆమెకు అండ‌గా నిలిచారు. మామూలుగానే సౌత్ న‌టీమ‌ణులంటే పెద్ద‌గా ప్రోత్స‌హించ‌ని బాలీవుడ్ మీడియాతో పెట్టుకున్న అక్ష‌ర‌కు రానున్న రోజుల్లోఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో.. ఏమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/