Begin typing your search above and press return to search.
పోలీసులను ఆశ్రయించిన అక్షర హాసన్
By: Tupaki Desk | 8 Nov 2018 6:57 AM GMTకమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కు చెందిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్ లో లీక్ అయిన విషయం తెల్సిందే. ఆ ప్రైవేట్ ఫొటోలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో - వెబ్ మీడియాలో ఆ ఫొటోలు పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో అక్షర హాసన్ స్పందించింది. తన ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడంపై ఆమె సీరియస్ అయ్యింది. ఒక అమ్మాయి ప్రైవేట్ ఫొటోలను లీక్ చేయడం, ఆ ఫొటోలను ఇతరులు షేర్ చేయడం లైంగిక వేదింపులు అంటూ ఆమె పేర్కొంది.
ముంబయి పోలీసులను, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ అధికారులను తాను కలిసినట్లుగా అక్షర హాసన్ చెప్పుకొచ్చింది. తన ప్రైవేట్ ఫొటోలను లీక్ చేసిన వారిని, వాటిని షేర్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చ్చినట్లుగా చెప్పుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సమయంలో ఒక అమ్మాయి ప్రైవేట్ ఫొటోలను షేర్ చేయడం కూడా లైంగిక వేదింపుల నేరం కిందకు వస్తుంది. పోలీసులు ఈ విషయంలో తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను అంటూ అక్షర హాసన్ పేర్కొంది.
తన ప్రైవేట్ ఫొటోలను మీడియాలో హాట్ టైటిల్స్ పెట్టి సర్కులేట్ చేస్తున్నారని, అలా చేయడం వల్ల వారికి ఏం ఉపయోగమో కాని, నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ అక్షర హాసన్ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు వారు త్వరలోనే తన ప్రైవేట్ ఫొటోల లీక్ కు పాల్పడ్డ వారిని కనిపెడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.