Begin typing your search above and press return to search.

అక్షర.. ఐదు నిమిషాలు ప్లీజ్‌! అన్నారు!!

By:  Tupaki Desk   |   20 Jan 2015 3:23 PM GMT
అక్షర.. ఐదు నిమిషాలు ప్లీజ్‌! అన్నారు!!
X
విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ గారాల తనయ అక్షరహాసన్‌ కథానాయిక అయిన సంగతి తెలిసిందే. ధనుష్‌, అమితాబ్‌ బచ్చన్‌ లాంటి సూపర్‌స్టార్లతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, పా ఫేం ఆర్‌.బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? అని అక్షరను ప్రశ్నిస్తే ఇలా చెప్పింది.

అనూహ్యంగా ఓ రోజు ఓ పెద్ద వేడుకలో ఆర్‌.బాల్కి నా వద్దకు వచ్చారు. అక్షర.. ప్లీజ్‌ మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి.. అన్నారు. అంతే వెంటనే మేం ఇద్దరం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఓ పాత్ర రాసుకున్నా. అది మీకోసమే సుమీ! అన్నారు. అంతే ఆ క్షణంలో నేను నటిస్తానా? అనుకున్నా. తర్వాత స్క్రిప్టు గురించి చర్చించాం. నటీనటుల గురించి తెలుసుకున్నా. చాలా ఎగ్జయిటింగ్‌ అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశా. అసలు నేను నటిస్తాను అని అనుకోనేలేదు. అలా నా సినిమా ఎంట్రీ జరిగిపోయింది. అమితాబ్‌, ధనుష్‌ లాంటి స్టార్‌ హీరోలతో నటిస్తున్నా అన్న విషయాన్ని తలుచుకోగానే చాలా నెర్వస్‌గా ఉంటుంది.. అని అక్షర చెప్పింది. అదీ సంగతి.