Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసిన‌ అక్షర హాసన్

By:  Tupaki Desk   |   7 May 2021 4:30 AM GMT
కిల్ల‌ర్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసిన‌ అక్షర హాసన్
X
అక్కా చెల్లెళ్లు శ్రుతిహాస‌న్- అక్ష‌ర హాస‌న్ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సులుగా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం ఉన్న భామ‌లుగా ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో పాపుల‌ర‌య్యారు. శ్రుతి ఇప్ప‌టికే రెండో ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళుతుంటే.. అక్ష‌ర మాత్రం కెమెరా వెన‌క ప‌నిని ఇష్ట‌ప‌డుతోంది. న‌టిగా కొన‌సాగుతూనే త్వ‌ర‌లోనే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం కూడా ఉంది.

ఇదిలా ఉండ‌గానే.. అక్ష‌ర మైండ్ బ్లాక్ చేసే ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. వైట్ అండ్ పింక్ మిక్స్ డ్ రోజ్ స్టైల్ టాప్ .. ప్లెయిన్ పింక్ ఫ్యాంట్.. దుప‌ట్టాతో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. అక్ష‌ర‌లో టామ్ బోయ్ ని ఈ రూపం కొంత‌వ‌ర‌కూ డామినేట్ చేసింద‌నే చెప్పాలి. అక్కా చెల్లెళ్లు శ్రుతి- అక్ష‌ర టామ్ బాయ్ యాటిట్యూడ్ ని ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. వెస్ట్ర‌న్ స్టైల్ లో వేష‌ధార‌ణ ప‌చ్చ‌బొట్లు చాలా కామ‌న్. అందుకే ఇప్పుడు ఈ ఫోటోషూట్ లో కొత్త‌ద‌నం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

డిజైనర్ అశ్విన్ త్యాగరాజన్.. ఫోటోగ్రాఫర్ వినోద్ డీకేల‌తో కలిసి అక్ష‌ర ఈ ఫోటోషూట్ చేశారు. త‌న‌ డిజైన‌ర్ లుక్ అద్భుతం..ఆ భంగిమలు మైండ్ బ్లోయింగ్. అక్షర సూపర్ హాట్ గా కనిపిస్తోంది. దేవత‌నే త‌ల‌పిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ ఫోటోల‌కు శ్రుతిహాస‌న్ వ్వావ్ అంటూ పొగిడేశారు. అన్న‌ట్టు అక్ష‌ర హాస‌న్ హిందీ-త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే అయినా.. తెలుగు తెర‌కు దూరంగా ఉంది. త్వ‌ర‌లోనే ఓ తెలుగు సినిమాలో న‌టిస్తుందేమో చూడాలి.