Begin typing your search above and press return to search.
చివరికి మిగిలేది దర్శకత్వమేనా స్టార్ డాటర్ కి?
By: Tupaki Desk | 26 Oct 2020 7:30 AM GMTబుచ్చిబాబు `చివరికి మిగిలేది` స్టోరీలా .. అన్ని శాఖల్లో విఫలమయ్యాక చివరిగా దర్శకులు కావాలని ఉందనేస్తారు. అదేదో ట్యాలెంట్ తో పని లేని వ్యవహారంలాగా కనిపిస్తుంటుంది. చాలామంది క్రియేటివ్ డైరెక్టర్లుగా ఎదిగేయాలని కలలు కంటూ .. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా నటీనటులు దర్శకులు అయ్యేందుకు నానా తపనా పడుతుంటారు. అయితే అది అయ్యే పనేనా?
పూర్తిగా దర్శకత్వమే విజన్ గా ప్రయత్నిస్తే అది వేరు. వేరే చోట్ల ఫెయిలయ్యాక ఇది ఖాళీగా ఉందిలే అని వెతుక్కుంటూ వస్తే అది వేరే. ఇప్పుడు అదే బాపతులో కలలుగనే చాలా మంది నాయికలు దర్శకులు కావాలనుకోవడం పరిశ్రమలో చర్చకు వచ్చింది.
అన్నట్టు విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టీ అక్షర హాసన్ దర్శకురాలు కావాలనుకుంటోందట. తన కలల్ని నిజం చేసుకోవాలనుకుంటోందట. అక్షర హాసన్ తన తండ్రి అడుగుజాడలను అనుసరించి ఏదో ఒక రోజు దర్శకురాలు కావాలనుకుంటున్నానని.. తన కలను వెల్లడించారు. కమల్ మాదిరిగా.. అక్షర కూడా తన సృజనాత్మకతకు రెక్కలు తొడుగుతుందట.
ఓవైపు నటిస్తూనే మరోవైపు ఆ రకంగానూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోందట. అక్షర ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. వాటి విడుదల కోసం వేచి చూస్తోంది. అగ్ని సిరాగుగల్ అనే ఇంటెన్సివ్ థ్రిల్లర్ ..ఏజ్డ్ డ్రామా.. `అచ్చం మేడమ్ నానమ్ పయిర్ప్పు` ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు ఇప్పటికే రిలీజయ్యాయి. అవి ఆశించిన దానిని మించి సంచలనం సృష్టించాయి.
అయితే కేవలం నటనతోనే అక్షర సంతృప్తి చెందేట్టు లేదు. ఈ రంగంలో ఆశించిన స్టార్ డమ్ అందకపోవడం వల్లనే దర్శకురాలు కావాలనుకుంటోందా? లేక స్వతహాగానే తండ్రి నుంచి అబ్బిన గుణమా? అంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ప్రాక్టికల్ గా దర్శకురాలై సత్తా చాటి చూపించడమే చెంప పెట్టు లాంటి సొల్యూషన్ అని చెప్పాలి. ఉబలాటం వేరు.. క్రియేటివిటీ వేరు అని ప్రూవ్ చేయాల్సి ఉంది.