Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి అక్షయ్​ సినిమా? నిజమేనా?

By:  Tupaki Desk   |   23 May 2021 8:40 AM GMT
ఓటీటీలోకి అక్షయ్​ సినిమా? నిజమేనా?
X
కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్ సినీ రంగం మీద భారీ ప్రభావం చూపిందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. కరోనా దెబ్బకు చాలా థియేటర్లు మూతపడ్డాయి. సింగిల్​ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి కరోనాకు ముందే దయనీయంగా ఉండేది. కరోనా దెబ్బకు అవి కోలుకోలేని దెబ్బ తిన్నాయి. చాలా థియేటర్లను ఫంక్షన్​హాల్స్​గా మార్చేశారు. ఓ దశలో మల్టిపెక్స్​ థియేటర్ల పరిస్థితి కూడా అయిపోయినట్టేనని.. ఇప్పుడంతా డిజిటల్​ యుగం అని ప్రచారం ఊపందుకున్నది. ఇప్పుడు ఓటీటీదే భవిష్యత్​ అంతా అని ప్రచారం సాగింది.

అయితే అన్​లాక్​ ప్రక్రియతో థియేటర్లు తెరుచుకోవడంతో.. మళ్లీ పాతరోజులు వచ్చేశాయి. చాలా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. థియేటర్లలో చూసిన మజా.. ఇంట్లో కూర్చోని చూస్తే రాదని చాలా మంది సినీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. వెరసి థియేటర్లకు జనం పోటెత్తారు. చాలా చిత్రాలకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. హమ్మయ్య సినీ రంగం బతికిపోయిందని అంతా భావించారు.

కానీ ఇంతలోనే మళ్లీ కరోనా సెకండ్​ వేవ్​ వచ్చేసింది. దీంతో సినీ రంగం కుదేలయ్యింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్​ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు వెళతారో? లేదో? డౌటే. ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణ ఓ రేంజ్​లో ఉంది.ఈ క్రమంలో బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్​ కుమార్​ నటించిన భారీ చిత్రం.. 'బెల్ బాటమ్' ఓటీటీలో విడుదల కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం గతంలో అక్షయ్​ నటించిన పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్​ అయ్యాయి.

అయితే ఈ ప్రచారాన్ని అక్షయ్​ ఖండించారు.

’నా సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అయితే బెల్​బాటమ్​ చిత్రం ఓటీటీలో విడుదల చేయాలా? వద్దా? అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే చిత్ర నిర్మాతలు ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు అక్షయ్​ ‘సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతేడాది మార్చిలో ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. కానీ కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​ తో విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా విడుదలపై కూడా సందిగ్ధం నెలకొన్నది.