Begin typing your search above and press return to search.
థర్డ్ జెండర్ కి స్టార్ హీరో మద్ధతు ప్రచారార్బాటమేనా?
By: Tupaki Desk | 6 Nov 2020 5:50 PM GMTహిజ్రా లేదా స్వలింగ సంపర్కులు (థర్డ్ జెండర్)గా సమాజంలో పేరుబడిన వారిని అసహ్యించుకోవడం నేరం. వారికి సమాజంలో జీవించే హక్కు ఉంది. పెళ్లి చేసుకుని సంసార జీవనం సాగించే హక్కును కూడా కల్పించింది కోర్టు. అయినా ఇంకా చిన్న చూపు చూసి వెలివేసే మనస్తత్వం ఉన్నవాళ్లు కనిపిస్తుంటారు.
అయితే తమకు మాత్రం అలాంటి సపరేషన్ భావజాలం లేదని నిరూపిస్తూ ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ - కియారా అద్వానీ జోడీ మూడవ లింగ సమాజానికి మద్దతునివ్వడం చర్చకు వచ్చింది. అందరితో సమాన ప్రేమకు వీరు అర్హులు అని ప్రచారం చేస్తున్నారు.
``లక్ష్మీ బాంబ్` (టైటిల్ లక్ష్మిగా మార్చారు) చిత్రం విడుదలకు ముందే మేకర్స్ ఒక కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇది మూడవ లింగ సమాజానికి సమాన హక్కులు.., ప్రేమ గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రచారంలో కిలాడీ అక్షయ్ కుమార్ ఒక లింగమార్పిడి సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా మార్చాలి అనేదానిని ప్రస్థావిస్తూ కవితను చదివారు.
ఈ వీడియోలో నటి కియారా అద్వానీ .. లింగమార్పిడి హక్కుల కార్యకర్త .. ప్రముఖ భరతనాట్యం నర్తకి లక్ష్మి నారాయణ్ త్రిపాఠి కూడా ఉన్నారు. లింగం అనే మూసను విచ్ఛిన్నం చేయడం లింగమార్పిడి సమాజానికి ప్రేమ గౌరవం రూపంలో మద్దతు ఇవ్వడం గురించి వీడియోలో వెల్లడించారు.
తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో వీడియోను పంచుకుంటూ నటుడు అక్షయ్ కుమార్ ఇలా అన్నారు. “నాజర్ సే బచ్నే కే లియే తోహ్ బహోట్ టిక్కే లగా లియే,.. నజారియా బాదల్నే వాలా టిక్కా లగనే కి # అబ్ హమారిబారిహై. లింగ మూసను విచ్ఛిన్నం చేద్దాం .. సమాన ప్రేమ గౌరవం కోసం నిలుస్తున్న లాల్ బిండితో థర్డ్ జెండర్ కి మన మద్దతును అందిద్దాం ” అని వ్యాఖ్యానించారు.
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన `లక్ష్మి` 2011 తమిళ చిత్రం కాంచనకు రీమేక్. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హిజ్రాగా నటించారు. తెలుగు తమిళ వెర్షన్లలో శరత్ కుమార్ కి ఆ పాత్ర మంచి పేరు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 9 న డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల కానుంది.