Begin typing your search above and press return to search.

పెళ్లి రోజున మొగుడు తలనొప్పి తెచ్చాడు

By:  Tupaki Desk   |   19 Jan 2016 5:02 AM GMT
పెళ్లి రోజున మొగుడు తలనొప్పి తెచ్చాడు
X
పెళ్లయ్యాక పదిహేను సంవత్సరాల వైవాహిక జీవితం. బాలీవుడ్ లో ఇంత సుదీర్ఘ కాలం నిలబడ్డ ప్రేమ పెళ్లిళ్లు తక్కువగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన జంటల్లో ఒకటి అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా. ఈ ఆదివారంతో వారిద్దరి పెళ్లి జరిగి 15 ఏళ్లు పూర్తయింది.

మరి పెళ్లి రోజంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. అందుకే తమ ఇద్దరి పాత ఫోటో ఒకటి షేర్ చేశాడు అక్షయ్. అందులో ట్వింకిల్ వంక చూస్తూ ఉంటాడు ఈ హీరో. 'ఇంత కాలం గడిచినా తను ఏం మారలేదు, ఇప్పటికీ నేను తన నుంచి కళ్లు తిప్పుకోలేను' అంటూ ఈ ఖిలాడి తన ప్రేమను చాటుకున్నాడు. అయితే... ట్వింకిల్ మాత్రం ఓ రైటర్. పైగా కామెడీ బుక్స్ రాస్తూ ఉంటుంది. అందుకే తన స్టైల్లో కామెడీ ట్వీట్లను షేర్ చేసింది. 'పెళ్లి రోజున మీ ఆయన మీకేం ఇచ్చారు? ఆ ఇచ్చారు ఓ బిత్తర చూపు', 'పెళ్లి రోజున మీ ఆయన ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇచ్చారు లెండి తలనొప్పి' అంటూ జోక్స్ పేల్చింది ట్వింకిల్.

ఆ తర్వాత మాత్రం తామిద్దరూ నవ్వుకుంటూ ఉన్న ఒక పిక్ ని షేర్ చేసింది ఈ సీనియర్ హీరోయిన్. ' పెళ్లి రోజున మీ ఆయన మీకు ఏమైనా ఇచ్చారా? నాకు ఈ పదిహేను సంవత్సరాల్లో ఇలాంటి ఆనందమైన క్షణాలను ఎన్నో ఇచ్చాడు' అంటూ తన ప్రేమను చాటుకుంది ట్వింకిల్ ఖన్నా. ఏమైనా జంటని ఫన్నీయెస్ట్ కపుల్ అనాల్సిందే. వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకోగలిగే ట్యాలెంట్ ఎవరికి ఉంటుంది చెప్పండి.