Begin typing your search above and press return to search.

దటీజ్.. అక్షయ్..!

By:  Tupaki Desk   |   9 Sep 2015 5:06 AM GMT
దటీజ్.. అక్షయ్..!
X
తెరపై స్టార్ లు ఎంతమందున్నా తెర వెనుకా ఆ గౌరవాన్ని పొందేవారు కొందరే వుంటారు. అలాంటి వాళ్ళలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒకరు. ఆయన జీవిత గాద కూడా సినిమా కథకు ఏమాత్రం తక్కువ కాదు. మార్షల్ ఆర్ట్స్ పై ప్రేమతో విదేశాల్లో నేర్చుకునే రోజుల్లో వంటవాడిగా పార్ట్ టైం జాబ్ చేసిన అక్షయ్ మిత్రుడి సలహాతో మోడలింగ్, తర్వాత వెండితెరపై తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోగా నిత్యం బిజీ గా గడిపే అక్షయ్ కుమార్ పుట్టినరోజు నేడు. దాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పిన కొన్ని విషయాలు..

- అక్షయ్ ని అందరూ కిలాడీ అని పిలుస్తారు కానీ అతడు చాలా మృదుస్వభావి. ఎంతో నిబద్దత గల వ్యక్తి. తన తల్లిదండ్రుల ద్వారా ఈ లక్షణాలు అబ్బాయని చెబుతున్న అక్కీ, పాతికేళ్ళ ఈ ప్రస్థానంలో వాటితోనే ఈ స్థాయికి వచ్చారట

- నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు కదా అంటే.. మరో పాతికేళ్ళ ప్రయాణం చేయడానికి సిద్ధంగా వున్నాను. నా వరకూ రిటైర్మెంట్ అంటే మరణమే.

- దేనిలో అయినా జయాపయాలు పరిపాటే. నటుడిగా సినిమాల విజయాలు, పరాజయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఫ్రైడే ఫీవర్ నాకు రాదు. కానీ 2015 కలిసొచ్చిందని చెప్పాలి. బేబీతో మంచి ఆరంభం దొరికితే గబ్బర్ ఈజ్ బ్యాక్, బ్రదర్స్ సినిమాలు ఆ పరంపరని కొనసాగించాయి. సింగ్ ఈజ్ బ్లింగ్ త్వరలో విడుదల కానుంది. హౌస్ ఫుల్ 3, ఎయిర్ లిఫ్ట్ సినిమాలు చేస్తున్నాను.

- హాలీవుడ్ తెరపైకి వెళ్ళాలని లేక కాదు.. నా దృష్టిలో అదో మహా సముద్రమైతే నేనో చేప పిల్లని. ఈ కాలంలో నటుడిగా పరిచయం అయ్యుంటే మాత్రం ఒక సైలెంట్ సినిమాతో పరిచయం అయ్యే వాడిని. ఒక విషయాన్ని మాటరూపంలో కంటే దృశ్య రూపంలో చెప్పడం ఎంతో బాగుంటుంది.

- స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం వున్నా కామెడి కలగలిపిన కథలంటే బాగా ఇష్టపడతా.

- బర్త్ డే స్పెషల్ గురించి అడిగితే.. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నా భార్య ట్వింకిల్ ఖన్నా నన్ను సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ఈ సారి నేనే తనను సర్ ప్రైజ్ చేయనున్నా అని ముగించాడు ఈ కిలాడీ.

అన్నట్టు.. సుమారు 600 మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నారు అక్షయ్. ఈ రియల్ హీరోకు తుపాకీ.కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.