Begin typing your search above and press return to search.
కపిల్ శర్మపై కిలాడీ షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 6 Sep 2022 10:39 AM GMTబాలీవుడ్ లో ఖాన్ లకు చెక్ పెట్టిన ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. గత కొంత కాలంగా విభిన్నమైన కథలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాల్ని సొంతం చేసుకుంటూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ హీరో అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ హీరోగానూ అక్షయ్ కూడా వార్తలో నిలిచాడు. అంతే కాకుండా తన ప్రాజెక్ట్ లని రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తాడనే పేరుండటంతో చాలా మంది ప్రొడ్యూసర్లు ఖాన్ లని పక్కర పెట్టి గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ వెంట పడుతున్నారు.
అయితే ఈ ఖిలాడీ హీరోకి ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. భారీ ప్రొడక్షన్ కంపనీల్లో వంద కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో అక్షయ్ నటించిన 'బచ్చన్ పాండే' డిజాస్టర్ అనిపించుకుంది. తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ' ఆధారంగా మరింత యాక్షన్ పార్ట్ ని జోడించి ఈ మూవీని రీమేక్ చేశారు. క్రితిసన్ హీరోయిన్ గా ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సౌత్ సినిమాల సునామీలో కొట్టుకుపోయింది.
ఆ తరువాత విడుదలైన 'సామ్రాట్ పృథ్వీరాజ్', రక్షా బంధన్' చిత్రాలు కూడా ఇదే బాట పట్టాయి. ఆదిత్య చోప్రా నిర్మించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' అక్షయ్ కుమార్ కు భారీ షాకిచ్చింది.
ఈ మూవీ చాలా చోట్ల షోలని రద్దు చేయాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మపై కిలాడీ షాకింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతని వల్లే తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయని అక్షయ్ కామెంట్ చేయడం విశేషం.
కపిల్ శర్మ గత కొంత కాలంగా మోస్ట్ పాపులర్ షో 'ది కపిల్ శర్మ షో'కు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాలీవుడ్ హీరోలని తన షోకు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ 'కట్పుత్లీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ తో కలిసి 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'ఏళ్లు గడుస్తున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నావని అక్షయ్ ని ఉద్దేశించిన కపిల్ శర్మ కామెంట్ చేశాడు. దీనికి అక్షయ్ ఇచ్చిన సమాధానం ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది.
వరుస సినిమాలు, డబ్బులు నాకు సంబంధించిన ప్రతీ విషయం మీద నీ కన్ను పడింది. ఆ కారణంగానే నా సినిమాలు వరుసగా పరాజయం అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడం లేదని' కపిల్ శర్మకు షాకిచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'ఓ మైగాడ్ 2', రామ్ సేతు, సెల్ఫీ, 'సూరారైపోట్రు' రీమేక్, కాప్సూల్ గిల్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.