Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని బాలీవుడ్ అనుసరిస్తుందన్న అక్షయ్
By: Tupaki Desk | 14 Aug 2022 6:33 AM GMTఇటీవల వరుస ఫ్లాపులతో హిందీ చిత్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ బస్టర్లు వంద కోట్ల క్లబ్ సినిమాలు ఉండేవి. ఖాన్ ల సినిమాలు వందల కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించేవి. కానీ ఇప్పుడా సన్నివేశం లేదు. కోవిడ్ తర్వాత పరిస్థితి మారింది. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణ వ్యవస్థను సరిదిద్దాలని చూస్తోందని ఆయన ప్రశంసించారు. ఇది నిజంగా మంచి చొరవ! అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. హిందీ చిత్ర పరిశ్రమ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా పరిశ్రమ ట్రాక్ లోకి రావడానికి కొంత పునర్నిర్మాణం అవసరం అని వ్యాఖ్యానించారు.
ఇదే ఇంటర్వ్యూలో అక్షయ్ తన కెనడియన్ పౌరసత్వం గురించి కూడా మాట్లాడారు. అక్షయ్ కుమార్ కెనడియన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నందుకు పదే పదే ట్రోలింగ్ కి గురయ్యాడు. ముఖ్యంగా అతను జాతీయ సమగ్రత.. దేశభక్తి గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ట్రోలర్లు విపరీతంగా విరుచుకుపడుతున్నారు. ఇటీవల అక్కీ కెనడియన్ పాస్ పోర్ట్ ను కలిగి ఉన్నప్పటికీ అతను భారతదేశంలో తన పన్ను(ట్యాక్స్) లు చెల్లిస్తున్నారు. దీనిపైనా ఒక ప్రశ్న ఎదురైంది.
తాజా ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ..భారతీయుడు అంటేనే భారతదేశానికి చెందినవాడు అని అర్థం. వారంతా ఎల్లప్పుడూ అలాగే ఉంటారు'' అని అన్నాడు. తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని కెనడాకు వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో తనకు కెనడా పౌరసత్వం లభించిందని వెల్లడించాడు. కొన్నేళ్ల క్రితం నా సినిమాలు ఆడలేదు. దాదాపు 14-15 సినిమాలు ఫ్లాపులయ్యాయి. కాబట్టి నేను వేరే చోటికి వెళ్లి అక్కడ పని చేయాలని అనుకున్నాను... అని తెలిపారు.
ట్విట్టర్ లో విమర్శకులుగా మారుతున్న వ్యక్తుల వల్ల మోసపోకండి. మేమంతా మా పని మేం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్నేహితుల సూచన మేరకు భారతదేశంలో విజయం సాధించలేకపోతే కెనడాకు రావాలని సూచించినప్పుడు ఏం చేయను? అందువల్ల అక్కడికి వెళ్లాలని భావించాను.. కానీ పౌరసత్వం పొందిన తర్వాత వరుస చిత్రాలతో మళ్లీ విజయం సాధించాను. ఆ తర్వాత వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు.
కెనడియన్ పాస్ పోర్ట్ ని కలిగి ఉండగా భారతదేశంలో పన్నులు చెల్లించడం గురించి ప్రశ్నించగా.. ''నా దగ్గర పాస్ పోర్ట్ ఉంది. పాస్ పోర్ట్ అంటే ఏమిటి? ఇది ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి ఉపయోగించే పత్రం. చూడండి.. ముందుగా నేను భారతీయుడిని. నేను నా పన్నులన్నీ ఇక్కడే చెల్లిస్తాను. అక్కడ కూడా చెల్లించడానికి నాకు ఆప్షన్ ఉంది. కానీ నేను వాటిని నా దేశంలో చెల్లిస్తాను. నేను మన దేశంలో పని చేస్తున్నాను. చాలా మందికి తెలియాలి.. నేను భారతీయుడిని.. నేను ఎప్పటికీ భారతీయుడినే!! అంటూ అక్షయ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం తాను భారతీయ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఉన్నానని అక్షయ్ గతంలోనూ వెల్లడించారు. నిజానికి 2019లో అక్షయ్ తన కెనడియన్ పౌరసత్వం పై తన ట్విట్టర్ హ్యాండిల్ లో స్పందించాడు. ''నా పౌరసత్వం గురించి అనవసరమైన ఆసక్తి .. ప్రతికూల వ్యాఖ్యలు నేను నిజంగా అర్థం చేసుకోలేదు. కెనడియన్ పాస్ పోర్ట్ ని కలిగి ఉన్నాననేది నేను ఎప్పుడూ దాచలేదు లేదా తిరస్కరించలేదు. గత ఏడేళ్లలో నేను కెనడాను సందర్శించలేదన్నది కూడా అంతే నిజం. నేను భారతదేశంలో పని చేస్తున్నాను.. నా పన్నులన్నీ భారతదేశంలోనే చెల్లిస్తాను. ఇన్నాళ్లూ భారతదేశంపై నాకున్న ప్రేమను నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా పౌరసత్వ సమస్య వ్యక్తిగతమైన చట్టపరమైన రాజకీయేతర విషయం.. దీనిని నిరంతరం వివాదాల్లోకి లాగటం నాకు నిరాశను కలిగించింది. నేను విశ్వసించే భారతదేశాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు నా చిన్నపాటి సహకారం అందించడాన్ని కొనసాగించాలనుకుంటున్నాను... అని సుదీర్ఘ నోట్ రాసారు.