Begin typing your search above and press return to search.

కలియుగ దానకర్ణుడు అంటే ఈ హీరోనే...!

By:  Tupaki Desk   |   28 April 2020 6:15 AM GMT
కలియుగ దానకర్ణుడు అంటే ఈ హీరోనే...!
X
కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ నుండి కూడా అందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కుంటున్న స‌మ‌యంలో మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు అక్ష‌య్. తాజాగా లాక్ డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ రియ‌ల్ హీరో. దీనిపై ముంబై పోలీస్ శాఖ అక్ష‌య్‌ కు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. దీంతో కరోనా పై పోరాటానికి ఇప్పటి దాకా అక్షయ్ ఇచ్చిన విరాళం 30 కోట్ల రూపాయలకు చేరింది.

అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన ముంబై పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు చంద్రకాంత్ పెండూర్కర్ మరియు సందీప్ సర్వ్‌ కి నేను వందనం చేస్తున్నాను. నేను నా కర్తవ్యాన్ని చేశాను.. మీరు కూడా సహాయం అవుతారని నేను ఆశిస్తున్నాను.. వారి వల్ల మనం సురక్షితంగా మరియు సజీవంగా ఉన్నామని మర్చిపోవద్దు' అని ట్వీట్ చేశారు. అక్షయ్ పెద్ద మనసు చూస్తున్న నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అక్షయ్ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో అని.. 'కలియుగ దానకర్ణుడు' అంటే అక్షయ్ కుమారే అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా పీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ. 25 కోట్ల విరాళాన్ని.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్కు రూ.3 కోట్లు విరాళం అక్షయ్ కుమార్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. కరోనా ప్రభావం వలన సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. అంతేకాకుండా లారెన్స్ డైరెక్షన్ లో 'లక్ష్మీబాంబ్' సినిమా ఇప్పటికే పూర్తి చేశాడు.